పవన్ కళ్యాణ్ వస్తున్నాడహో...ఇదే ఆ ఇన్విటేషన్

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న 'రేయ్' మూవీ ఆడియో ఫంక్షన్‌కు హాజరవుతారా? లేదా? అనే ఉత్కంఠకు తెర పడింది. పవన్ కళ్యాణ్ పర్సనల్ సమస్యల వల్ల రాలేక పోవచ్చే ప్రచారం జరిగిప్పటికీ.....తాజాగా విడుదలైన 'రేయ్' మూవీ ఇన్విటేషన్‌తో ఆయన పేరు ఉండటంతో ఈ విషయమై క్లారిటీ వచ్చింది. రేపు (జనవరి 17) హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆడియో వేడుక జరుగనుంది.

వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వచ్చే 'రేయ్' చిత్రం ద్వారా సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు పెంచేందుకు వైవిఎస్ వినూత్న రీతిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్‌తో 'రేయ్' మూవీ A టు Z లుక్ విడుదల చేయించిన ఆయన ఇపుడు పవర్ స్టార్‌తో ఆడియో విడుదల కార్యక్రమం ఏర్పాటు చేసారు.

Pawan Kalyan To Attend Rey Audio Launch Function

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో.....'రేయ్' సినిమాలో సాయి ధరమ్ తేజ్ అలా కనిపిస్తారు అని ప్రచారం చేస్తున్నారు వైవిఎస్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన A టు Z లుక్‌లో కూడా ఇవే విషయాలను పొందు పరిచాడు దర్శకుడు.

రిలీజ్ అయిన 'రేయ్' ప్రెస్ స్టిల్స్ చూసి మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి సాయిధరమ్ తేజ్ స్టిల్స్‌లో నాలాగే ఉన్నాడని చెప్పాడట. ఆ స్టిల్ష్ చూసిన వారంతా సాయి ధరమ్ తేజ్ మెగాస్టార్‌లా ఉన్నాడని ప్రశంసించారని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'గుడుంబా శంకర్', 'బాలు' సినిమాల్లో ఆయన వాడిని పాంట్స్‌ని సాయి ధరమ్ తేజ్‌కు వాడమని ఇచ్చారని వెల్లడించారు.

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వరలో 'రేయ్' చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో 'రేయ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిధరమ్ తేజ్, సయామి ఖేర్, శ్రద్ధా దాస్ హీరో హీరోయిన్లు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X