రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ కోసం పవన్
పవన్ కళ్యాణ్.. మెగా కుటుంబం మధ్య సంభందాలు దెబ్బ తిన్నాయంటూ రూమర్స్ వస్తున్న నేపధ్యంలో ఎంగేజ్ మెంట్ పంక్షన్ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పవన్ మాత్రం ఎలాంటి అపోహలకు తావు ఇవ్వకుండా ఎంగేజ్ మెంట్ లో పాల్గొనలాని నిర్ణయించుకన్నారు. అందుకోసం ఆయన ఆయన పొల్లాచి లో తన గబ్బర్ సింగ్ షూటింగ్ ని వాయిదా వేసుకుని మరీ వస్తున్నారు. నిజానకి డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి అక్కడ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పవన్ డిసెంబర్ రెండవ తేదీన వస్తానని చెప్పి, ఎంగజ్ మెంట్ లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో ఆ రోజంతా ఎంగజ్ మెంట్ పంక్షన్ లో బిజీగా పవన్ గడపనున్నారు.
ఇక రామ్ చరణ్, ఉపాసనా కామినేనిల ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు జరగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగాస్టర్ చిరంజీవి ఇంట్లోనూ, అటు అపోలో ఛైర్ పర్సన్ ప్రతాప్ రెడ్డి ఇంట్లోనూ సందడి నెలకొందని తెలుస్తోంది. డిసెంబర్ 1న ఉదయం 10గంటలకు ఈ వేడుక ఆరంభమవ్వనుందట. కరెక్ట్ గా 11.55కు రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ రింగ్ ని ఉపాసనాకి తొడగుతాడని తెలుస్తోంది. గండిపేట సమీపంలోని గోల్కోండ రిసార్ట్స్ లో ఈ వేడుక జరగనుంది. తన నిశ్చితార్థానికి రావాలని చెర్రీ గవర్నర్ దంపతులను ఆహ్వానించిన విషయం విధితమే. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారని సమాచారం. అమితాబ్ ప్రత్యేక అతిధిగా ఈ పంక్షన్ కి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











