అల్లు అర్జున్ పెళ్ళి వేడుకలో సాదాసీదాగా పవన్ కళ్యాణ్...!
అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న తమ అభిమాన హీరో అల్లు అర్జున్ వివాహ వేడుక హైదరాబాదు, మాదాపూర్ లోని హైటెక్స్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈవివాహం ఒక దేవాలయంలో దైవ సన్నిధిలో జరుగుతున్న అనుభూతి కలిగించడానికి లక్షలాది రూపాయల వ్యయంతో అందమైన దేవాలయం సెట్ ను వేశారు. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ లకు చెందిన ప్రముఖులతో బాటు, రాజకీయనాయకులు కూడా పలువురు ఈ వేడుకకు తరలి వచ్చారు.
అల్లు అర్జున్ వివాహ వేడుకల్లో భాగంగా జరిగిన కార్యక్రమాలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవ్వలేదు. బన్నీని పెళ్ళి కొడుకు చేసినప్పుడు, సంగీత్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనకపోవడంతో కుటుంబంలో ఉన్న మనస్పర్థలు వల్లే పవన్ కళ్యాణ్ ఈ వేడుకలకు దూరంగా ఉంటున్నాడని చాలా మంది మాట్లాడుకున్నారు. అసలు బన్నీ పెళ్లికి పవన్ కళ్యాణ్ వస్తోడో?లేదోనని కూడా మాట్లాడు కున్నారు. కానీ పెద్దంతగా వేడుకల్లో పాల్గొనడానికి ఇష్టపడని పవన్ కళ్యాణ్ బన్నీ పెళ్ళి వేడుకల్లో మాత్రం పాల్గొన్నాడు. జీన్స్, టీ షర్ట్ ధరించి క్యాజువల్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ ని అల్లు అరవింద్ ఆప్యాయంగా ఆహ్వానించి తీసుకెళ్ళాడు.


Click it and Unblock the Notifications











