పవన్ కళ్యాణ్ ని అక్కడ చూడటం ఆనందమే (ఫొటోలు)
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలన్నింటినీ సక్రమంగా అమలు చేస్తారని తాను విశ్వసిస్తున్నట్లు జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ చెప్పారు. అవి అమలు కాకపోయినా, ఏదైనా తప్పు జరిగినట్లు అనిపించినా తప్పకుండా వారి దృష్టికి తీసుకెళ్తానని, నిలదీస్తానని అన్నారు.
పవన్ ... ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన సెజ్ తదితర కొన్ని ప్రణాళికలు వారికి మాత్రమే లాభం చేకూర్చేలా ఉన్నాయనిపించినట్లు చెప్పారు. సహజ వనరుwలను ఎంత వరకు అవసరమో అంతవరకే వినియోగించుకోవాలని, బళ్లారి గనుల తరహాలో ఇష్టానుసారం నష్టం చేకూర్చడం మంచిది కాదని స్పష్టం చేశారు.
ఇటువంటి విషయాల్లో మోడీ తగిన విధానాలను పాటిస్తారని తాను భావిస్తున్నానని అన్నారు. తాను రెండు, మూడు సినిమాలు చేస్తున్నానని, అవి పూర్తికాగానే రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెడతానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఫొటోలు స్లైడ్ షోలో...

ఒక్కడే...
పవన్ కళ్యాణ్ ఒక్కడే..ఎలక్షన్స్ లో నిలబడకుండా హౌస్ ఆఫ్ పార్లమెంట్ లోకి ప్రవేశించి,నరేంద్ర మోడీ ప్రసంగాన్ని విన్న వ్యక్తి

షేక్ హ్యాండ్ లు ఇస్తూ...
పవన్ కళ్యాణ్ ఇలా ఎంపి లు అందరికీ షేక్ హ్యాండ్ లు ఇస్తూ కనిపించారు

అనుబంధం
పవన్ కళ్యాణ్ కొత్తగా ఎన్నికైన బిజేపి ఎంపి లందరినీ ఆయన పలకరిస్తూ విష్ చేసారు.

పెద్దల్ని...
సెంట్రల్ హాల్ లోకి ప్రవేశించటానికి ముందు పవన్ కళ్యాణ్ .. బిజేపి సీనియర్స్ ఎల్ కె అద్వాని, రంజిత్ సింగ్ ,సుష్మా స్వరాజ్ వంటి వారిని కలిసారు.

టాలీవుడ్ ఆనందం
పవన్ కళ్యాణ్ ని ఇలా డిల్లీ సెంట్రల్ హాల్ లో చూడటం టాలీవుడ్ లో చాలా మందిని ఆనందపరిచింది. వారు ట్వీట్స్ రూపంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications











