హమ్మయ్య...ఈ నెలాఖరు నుండే పవన్ మూవీ షురూ
హైదరాబాద్: రాజకీయాలు, ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సినిమా షూటింగులకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు మళ్లీ సెట్స్ పైకి వెళ్ల బోతున్నారు. ఈ నెలాఖరు నుండి 'ఓ మై గాడ్' తెలుగు రీమేక్ షూటింగ్‌లో ఆయన పాల్గొనబోతున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ 'ఓ మై గాడ్' సినిమాకి రీమేక్ ఓ చిత్రాన్ని పవన్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మేరకు ఏర్పాట్లు మెగా స్పీడుతో జరుగుతున్నాయి. ఈ చిత్రానికి రకరకాల టైటిల్స్ అనుకుని పవన్ వద్ద ప్రపోజల్ పెట్టారని తెలుస్తోంది. అందులో 'దేవ దేవం భజే' అనే టైటిల్ ని ఆయన ఓకే చేయటంతో ఖరారు చేసినట్లు సమాచారం. పవన్ సూపర్ హిట్ అత్తారింటికి దారేది చిత్రంలో 'దేవ దేవం భజే' ట్రాక్ ఉంది. అప్పట్లో ఎమ్.ఎస్ సుబ్బలక్ష్మి గానం చేసిన ఈ ట్రాక్ చాలా పాపులర్. దేవుడికి,భక్తుడికి చెందిన చిత్రం కాబట్టి ఈ టైటిల్ సూటయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అలాగే బాలీవుడ్ చిత్రాన్ని చాలా మార్చి తెలుగు నేటివిటికి తగినట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఒరిజనల్ లో ఉన్న పరేష్ రావెల్ పాత్ర కు ఇద్దరు పిల్లలు ఉంటే..ఇక్కడ వెంకటేష్‌కి ఇద్దరు చెల్లెళ్లు ఉండేలా మార్చారని తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ గెటప్ సైతం పూర్తి మార్పుతో ఉంటుందని, దానిపై కసరత్తు జరిగిందని చెప్తున్నారు.
పవన్ కల్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అది ఇప్పటికి కుదిరింది. రేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ చేసిన శ్రీ కృష్ణుని పాత్రలో పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ చేసిన ఓ సాధారణ వ్యాపారి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. డాలీ ఈ చిత్రం డైరక్ట్ చేస్తారు.


Click it and Unblock the Notifications











