‘తీన్ మార్’ ఆడియో వేడుక మా మూవీస్ లో ప్రత్యక్ష ప్రసారం...!
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'తీన్ మార్' ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 21 న శిల్ప కళ వేదిక, హైదరాబాద్ లో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని మా మూవీ టివి చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. పవన్ కళ్యాణ్, త్రిష తో పాటు సినిమా కు పనిచేసిన నటినటులు, సాంకేతిక నిపుణులు హాజరవుతారని సమాచారం. జయంత్ సి పరాన్జీ దర్సకత్వం వహించిన ఈ చిత్రం లో కృతి కర్బంద, పరీష్ రావెల్ తదితరులు ప్రధాన పత్రాలు పోషించారు.
పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ ఫై గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతాన్ని స్వరపరిచిన ఈ ఆల్బంలో చిరంజీని ఒక నాటి హిట్ సాంగ్' చిలుక క్షేమమ' పాటను రిమిక్స్ చేసినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమా హిందీ చిత్రం 'లవ్ అజ్ కల్' కు రీమేక్ గా తెరకెక్కింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న తీన్ మార్ ఏప్రిల్ రెండో వారంలో విడుదలకు సిద్దం అవుతుంది.


Click it and Unblock the Notifications











