'గబ్బర్ సింగ్'పై అఖిల్ అక్కినేని ట్వీట్
నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని తాజాగా గబ్బర్ సింగ్ చిత్రం చూసాడు. ఆ సినిమా గురించి ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ...గబ్బర్ సింగ్..ఈ మధ్యకాలంలో నేను చూసిన మోస్ట్ ఎంటర్టన్మెంట్ మూవీ. హ్యాట్యాఫ్ టు పవన్ కళ్యాణ్..ఇలాంటి మూవిని అందించినందుకు..ఈ చిత్రం రీమేక్ అయినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టలేదు.. సూపర్బ్ ఎంటర్టన్మెంట్...అంటూ ట్వీట్ చేసారు. ఇది చదివిన పవన్ ఫ్యాన్స్ చాలా ఆనందపడుతున్నారు.
ఇక ఇప్పటికే గబ్బర్ సింగ్ పై సిని ప్రముఖులంతా ప్రశంసలు వర్షం కురిపించేసారు. ముఖ్యంగా శృతి హాసన్ ఈ హిట్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది. ఆమె స్పందిస్తూ... ''మొన్నటిదాకా 'ఐరన్ లెగ్' అన్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి 'గోల్డెన్ లెగ్' అంటున్నారు. పరిస్థితులను బట్టి మార్చుకునే అభిప్రాయాలను నేను అస్సలు పట్టించుకోను అంది. అలాగే ...నా గురించి పూర్తిగా నాకు తెలుసు. 'గబ్బర్ సింగ్' సినిమాకు సైన్ చేసినప్పుడే ఈ సినిమా నాకు హిట్‌ని ఇస్తుందనిపించింది. అయితే.. ఇంత హిట్‌ని మాత్రం ఊహించలేదు. ఈ విజయానికి ప్రధానకారకుడు పవర్ స్టార్. ఇది ఆయన విజయమే. తర్వాతే ఎవరైనా. ఏదిఏమైనా నా యూనిట్ సభ్యులందరికీ పేరుపేరున కంగ్రాట్స్ చెబుతున్నాను అంది. ఇక గబ్బర్ సింగ్ చిత్రంలో ఆమె భాగ్యలక్ష్మి పాత్రను పోషించింది.
అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్..దర్శకుడు హరీష్ శంకర్ ని మెచ్చుకుంటూ... ఫస్ట్ కంగ్రాట్స్ టు హరీష్..బికాజ్...చాలా బాగా రాసాడు..చాలా బాగా తీసాడు..కళ్యాణ్ ని అందరూ ఎలా చూడాలనుకుంటున్నామో..అలా చూపించాడు అనిపించింది. ఈ సినిమా ఆల్రెడీ ఎంత హిట్టైందో అందరికీ తెలిసిందే.నేను చెప్పేదేమీ లేదు.. ఈ సినిమాకు పనిచేసిన టీమ్ అందరికీ...డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు గారికి,ప్రత్యేకంగా హరీష్ కి, కళ్యాణ్ గారికి,గణేష్ కి కంగ్రాట్యులేషన్...అండ్ దేవి డిడ్ ఎ ఫ్యాబ్యులెస్ జాబ్...అండ్ ఆల్ ది బెస్ట్ టు హిమ్ అండ్ కంగ్రాట్యులేషన్స్... ధాంక్యూ..." అన్నారు.


Click it and Unblock the Notifications











