పవన్ బాలీవుడ్ ప్రాజెక్ట్...బడ్జెట్ ఎంత?

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్ మూవీ ఖరారైన విషయం తెలిసిందే. ఈచిత్రాన్ని కొండా కృష్ణం రాజు శ్రీ వరసిద్ది వినాయక ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించారు. అయితే ఈచిత్రం బడ్జెట్ ఎంత? నేపథ్యం ఏమిటి? దర్శకుడు ఎవరు అనే చర్చ సర్వత్రా సాగుతూనే ఉంది.

గతంలో కొండా కృష్ణం రాజు సింగితం శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ హీరోగా ఏసుక్రీస్తు జీవితంపై సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత చాలా రోజులు ఆ సినిమా ఊసెత్తక పోవడంతో అంతా ఆ చిత్రం రద్దయిందనే అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఈ నిర్మాత మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ తో బాలీవుడ్ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. అయితే దర్శకుడు సింగితం శ్రీనివాసే అని మాత్రం చెప్పలేదు.

అయితే ఫిల్మ్ నగర్లో మాత్రం ఆయన తీయబోయేది ఏసుక్రీస్తు జీవితంపై సినిమానే అని, పవర్ స్టార్ ఇందులో జీసెస్ గా కనిపించబోతున్నారని, ఈ షూటింగ్ జెరూసలెం, బెత్లహాంలలో జరుగనుందని ప్రచారం జరుగుతోంది. మొత్తం 30 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని అంటున్నారు.

పవన్ పోషించే పాత్ర విషయానికొస్తే...జీసస్ కు శిలువ వేసే ముందు కాళ్ళకు, చేతులకు మేకులు కొడతారు. అలా మేకులు కొట్టే వ్యక్తి చాలా క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ తన పని తాను చేసుకుంటూ వుండగా..మేకులు కొట్టే టప్పుడు జీసస్ చిందించిన రక్తం ఒక్కసారిగా ఆ క్రూరుడి మొఖంపై పడుతుందట. ఆ రక్తం తన మొఖం పై నుంచి కారుతూ కంటిపైకి రావటం, తన కంట్లోనుంచి రక్తం కారుతుండటంతో ఆ క్రూరుడు తన క్రూరత్వాన్ని గ్రహించుకుని ఒక్కసారిగా మారు మనస్సు పొంది తను మేకులు కొట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడట.

ఒక్క రక్తపుబొట్టు ఆ క్రూరుడ్ని మార్చటం ఆ సినిమాకి కీలకమైన మలుపు అవుతుందని తెలుస్తుంది. అలా క్రూరత్వమైన పాత్ర నుంచి ఓ మంచి మనిషిగా మారే పాత్రను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోషించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిర్మాత కొండా కృష్ణం రాజు ఈ సినిమా విషయమై పూర్తి క్లారిటీ ఇస్తే తప్ప పై వార్తల్లో నిజం ఎంతో తేలే అవకాశం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X