పవన్ కళ్యాణ్ తిరుగుముఖం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న 'గబ్బర్ సింగ్' సినిమా తమిళనాడులోని పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం పొల్లాచ్చిలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఇక్కడ హీరో, హీరోయిన్లపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, పాటల చిత్రీకరణ జరిగింది. షూటింగ్ పూర్తి కావడంతో పవన్ కళ్యాణ్ యూనిట్ సభ్యులు హైదరాబాద్ కు తిరుగుటపా కట్టారు.
దర్శకుడు హారిష్ శంకర్ సినిమా గురించి మాట్లాడుతూ...పొల్లాచ్చిలో జరిగిన షూటింగ్ బాగా వచ్చిందని అన్నారు. పవన్ కళ్యాణ్... తమ్ముడు, బద్రి సినిమాల మాదిరి ఫ్యాషనబుల్ ఎనర్జీతో చాలా బాగా నటించాడని అన్నారు.
సినిమా యూనిట్ సభ్యులు నుంచి అందిన సమాచారం ప్రకారం సినిమాలో పవర్ ఫుల్ డైలాగులతో పాటు, దుమ్ము రేపే యాక్షన్ సీన్లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ జనవరి మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఇదివరకు పవన్ నటించిన తీన్ మార్ చిత్రాన్ని నిర్మించిన గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హిందీ 'దబాంగ్' చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రౌడీల పట్ల రౌడీగా వ్యవహరించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు.


Click it and Unblock the Notifications











