బాలకృష్ణ వర్సెస్ పవన్ కళ్యాణ్!
హైదరాబాద్: టాలీవుడ్ అగ్రహీరోలైన బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఒకే రకమైన పాత్రలతో బాక్సాఫీసు వద్ద పోటీ పడబోతున్నారు. దీంతో ఇటు సినిమా ట్రేడ్ వర్గాల్లో ఈ సారి ఎవరు పైచేయి సాధిస్తారనే ఆసక్తి నెలకొంది. ఇద్దరు హీరోలు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారే కావడంతో ఇరు వర్గాలు తమ సినిమాలకు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. రెండు సినిమాలు చాలా తక్కువ గ్యాప్ లోనే విడుదలవుతుండటం మరో విశేషం.
ప్రస్తుతం బాలకృష్ణ 'శ్రీమన్నారాయణ' అనే చిత్రంలో నటిస్తున్నారు. రవికుమార్ చావాలి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో బాలయ్య పవర్ ఫుల్ జర్నలిస్టు పాత్ర చేస్తున్నారు. ఎల్లో ఫ్లవర్స్ బేనర్ పై రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పార్వతి మెల్టన్ ఈ చిత్రంలో హీరోయిన్లు. ప్రస్తుతం సమాజంలో ఒక సామాన్య మానవుడికి జరుగుతున్న అన్యాయాలను గురించి ప్రస్తావిస్తూ యూత్ ని బాగా ప్రభావితం చేసే విధగా ఈచిత్రాన్ని రూపొందించారు. బాలకృష్ణ బాధ్యతాయుతమైన పాత్రలో కనిపిస్తారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక టీవీ జర్నలిస్ట్ గా కనిపించనున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం కూడా సమాజంలో జరుగుతున్న దారుణాలను టార్గెట్ చేస్తూ ఉంటుందని టాక్. ముఖ్యంగా పవన్ నోట పొలిటికల్ సెటైర్లు వినిపిస్తాయని అంటున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన తమన్నా హీరోయిన్. పవన్ కళ్యాణ్ మెకానిక్‌గా కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నా ఇంకా క్లారిటీ రాలేదు.
ఒక రకంగా ఈచిత్రాలు మెగా, నందమూరి అభిమానుల మధ్య పోటీ వాతావరణానికి దారి తీస్తాయని, తమ హీరోని విజేతగా నిలిపేందుకు ప్రయత్నిస్తారనే వానద కూడా లేక పోలేదు. బాలయ్య సినిమా సెప్టెంబర్లో, పవన్ సినిమా అక్టోబర్లో విడుదలవుతోంది. మరి ఏ జరుగబోతోందో చూడాలి.


Click it and Unblock the Notifications











