»   » చిరును మించిన పవన్-ఫ్యాన్స్ తీరే నిదర్శనం!

చిరును మించిన పవన్-ఫ్యాన్స్ తీరే నిదర్శనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవిని మించిపోయాడా? మెగా అభిమానులు ఇప్పుడు చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది మెగా అభిమానుల తీరు చూస్తుంటే. సోమవారం సాయంత్రం జరిగిన 'ఎవడు' ఆడియో ఫంక్షన్లో జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనం.

రామ్ చరణ్ హీరోగా రూపొందిన 'ఎవడు' ఆడియో శిల్పకళా వేదికలో నిన్న సాయంత్రం జరుగగా భారీ సంఖ్యలో అమెగా అభిమానులు హాజరయ్యారు. ఆడియో విడుదలకు రెండు మూడు రోజు నుంచి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారంటూ ప్రచారం జరిగింది.

అత్తారింటికి షూటింగులో భాగంగా యారప్ వెళ్లిన పవన్ కళ్యాణ్ 'ఎవడు' ఆడియో వేడుకకు గైర్హాజరవ్వడం, అనుకోని విధంగా చిరంజీవి ఈ వేడుకకు హాజరు కావడం జరిగింది. పవన్ కళ్యాణ్ వస్తాడని ఎన్నో ఆశలతో వచ్చిన అభిమానులు ఆయన రావడం లేదనే వార్త విని అసంతృప్తికి గురయ్యారు.

ఆడియో వేడుక మొదలైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ రావాలంటూ నినాదాలు చేసారు. అయితే యాంకర్లు వేణుమాధవ్, సుమ.....పవన్ ఎందుకు రాలేక పోయారో అనే విషయాన్ని స్పష్టంగా చెప్పుకొచ్చారు. అయినా అభిమానులు వినిపించుకోలేదు. చిరంజీవి ఆడిటోరియంలోకి ఎంటరైన కూర్చీలో కూర్చున్న తర్వాత కూడా 'వి వాంట్ పవన్ కళ్యాణ్' అంటూ మరో సారి నినాదాలు చేసారు అభిమానులు. దీంతో చిరంజీవి ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి చూసారు. అయినా వారి నినాదాలు ఆగలేదు.

చేసేది లేక వేణుమాధవ్ మరోసారి పవన్ ఎందుకు రాలేక పోయారో వివరణ ఇచ్చారు. ఆ తర్వాత వేదిక ఎక్కిన చిరంజీవి పవన్ విదేశాల్లో ఉండటం వల్లనే రాకలేక పోయారని, ఎవడు సిల్వర్ జూబ్లీ పంక్షన్‌కు తప్పకుండా హాజరవుతారని స్పష్టం చేసాడు. స్వయంగా చిరంజీవి చెబితే తప్ప శాంతించలేదు మెగా అభిమానులు.

English summary
Pawan Kalyan beats Chiranjeevi in popularity. Yevadu audio was launched yester day. Entire mega family with Chiranjeevi,Ram Charan, Allu Arjun graced the occasion. However fans dearly missed Pawan Kalyan. Sensing fans disappointment, Chiru promised them with an assurance that the film's silver jubilee function will be celebrated only in the presence of Power Star Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu