మినిస్టర్ కుమారుడికి పవన్ పాఠాలు

By Srikanya

హైదరాబాద్: తెలుగు దేశం మినిస్టర్ గంటా శ్రీనివాస రావు కుమారుడు గంటా రవితేజ త్వరలో హీరోగా లాంచ్ అవుతన్న సంగతి తెలిసిందే. తణికెళ్ల భరణి దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ నేపధ్యంలో ఆయన పవన్ కళ్యాణ్ ని స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి తన కుమారుడుకి నటనలో కొన్ని టిప్స్ చెప్పి గైడ్ చేయమని కోరినట్లు సమాచారం. గంటా శ్రీనివాసరావు తో ఉన్న అనుబంధంతో పవన్ ఒప్పుకున్నాడని, గోపాల గోపాల షూటింగ్ అనంతరం పంపమని కోరినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక నాగార్జున సైతం ఈ కొత్త హీరోకు కొన్ని సలహాలు ఇచ్చారని, ఇప్పటికే నాగ్ ని కలిసారని వినపడుతోంది.

నటుడు నుంచి దర్శకుడుగా మారిన తణికెళ్ల భరణి తన తదుపరి చిత్రానికి హీరోని ఎన్నుకున్నారు. మినిస్టర్ గంటాశ్రీనివాసరావు కుమారుడు గంటా రవి హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. జనార్దన మహర్షి మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ప్రేమయాత్రలకు బృందావనం అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని చెప్తున్నారు.

Pawan Kalyan to become a teacher for Ganta's son

'గోపాల గోపాల' చిత్రం విషయానికి వస్తే..

దేవుడంటే నమ్మకం లేని ఓ వ్యక్తి దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్‌ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు.

'గోపాల గోపాల' చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. హిందీలో విజయవంతమైన 'ఓ మైగాడ్‌' చిత్రానికి ఇది రీమేక్‌. ఇందులో పవన్‌కల్యాణ్‌ మోడ్రన్‌ శ్రీకృష్ణుడిగా నటిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషోర్‌ పార్థసాని దర్శకత్వం వహిస్తున్నారు. శ్రియ నాయికగా నటిస్తోంది. రీసెంట్ గా రెండవ షెడ్యూల్‌ను జరుపుకున్న ఈ చిత్రం కోసం ఇటీవల వెంకటేష్‌, పవన్‌ పాల్గొనగా, కొన్ని కీలక సన్నివేశాలను రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరించారు.

ఆ మధ్యన పవన్‌పై అర్థరాత్రి సమయంలో హైదరాబాద్‌ హైటెక్స్‌ సమీపంలో బైక్‌పై ఛేజింగ్‌ సన్నివేశాలు చిత్రీకరించారని తెలిసింది. సినిమాకు ఈ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. పవన్‌ కోసం ఈ బైక్‌ను అమెరికా నుంచి దిగుమతి చేశారని తెలిసింది. అన్ని పనులు పూర్తిచేసి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X