Sye raa వేడుకలో అరుదైన దృశ్యం.. నేరుగా వేదికపైకి దూసుకురావడంతో.. గట్టిగా అరిచిన పవన్ కళ్యాణ్

ఓ పబ్లిక్ ఈవెంట్ అంటే ఎన్నోరకాల సమస్యలుంటాయి. సెలెబ్రిటీల సెక్యూరిటీ మొదలుకొని అక్కడకు వచ్చిన అభిమానుల సెక్యూరిటీ వరకు అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదే. ఈ మధ్యకాలంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ పేరిట బహిరంగ వేదికలపై అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
మూవీ మేకర్స్. అయితే ఈ కార్యక్రమాల్లో ఒక్కోసారి ఊహించని సంఘటనలు కూడా జరుగుతుంటాయి. ఆదివారం జరిగిన సైరా ప్రీ రిలీజ్ వేదికపై అలాంటి ఓ అరుదైన సంఘటనే జరిగింది. వివరాల్లోకి పోతే...

భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక

భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం నాడు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.

కిటకిటలాడిన ఎల్‌బీ స్టేడియం

కిటకిటలాడిన ఎల్‌బీ స్టేడియం

హైదరాబాద్ లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు పెద్ద ఎత్తున మెగా అభిమాన వర్గం తరలి వచ్చారు. ఎల్‌బీ స్టేడియం అంతా మెగా సంద్రంగా మారి అభిమానులతో కిటకిటలాడింది. ఈ వేడుకకు సుమ హోస్ట్‌గా వ్యవహరిస్తూ సైరా విశేషాలు చెప్పి ఆకట్టుకుంది.

ముఖ్య అతిథిగా పవన్.. వేదికపై ప్రసంగం

ముఖ్య అతిథిగా పవన్.. వేదికపై ప్రసంగం

'సైరా నరసింహా రెడ్డి' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి సోదరుడు, జనసేన అధినేత, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరై సందడి చేశారు. సైరా వేదికపై ఆయన ప్రసంగిస్తుంటే.. మెగా అభిమానుల ఈలలతో సభా ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. పవన్ ప్రసంగం రసవత్తరంగా సాగింది.

నేరుగా వేదికపైకి దూసుకురావడంతో అప్రమత్తం

పవన్ కళ్యాణ్ వేదికపై ప్రసంగిస్తుండగా.. ఆయన వెనకాలే మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, వీవీ వినాయక్, రామ్ చరణ్ నిల్చొని ఉన్నారు. ఇంతలో ఓ అభిమాని నేరుగా వేదికపైకి దూసుకొచ్చి జనసేనాని కాళ్లపై పడ్డాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తమైన బౌన్సర్లు ఆ అభిమానిని కిందకు పంపించే ప్రయత్నం చేయబోయారు.

 కోపంతో అరిచిన పవన్.. హోరెత్తిన స్టేడియం

కోపంతో అరిచిన పవన్.. హోరెత్తిన స్టేడియం

దీంతో పవర్ స్టార్‌ పవన్ రియాక్ట్ అవుతూ కోపంగా బౌన్సర్లపై అరిచారు. ఆప్ లోగ్ ఛలే జాయే.. అరే భాయ్.. ఆప్ లోగ్ పీచే జాయే ప్లీజ్. ఛలే ఆప్ అన్నారు పవన్. ఆ వెంటనే సదరు అభిమానిని హత్తుకొని తన లోని సింప్లిసిటీ చూపించారు జనసేనాని.

 నేరుగా చూసిన మెగా ఫ్యాన్స్

నేరుగా చూసిన మెగా ఫ్యాన్స్

దీంతో ఆ దృశ్యం చూసి మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఈలలు వేయడం, కేకలు పెట్టడంతో స్టేడియం హోరెత్తిపోయింది. మరోవైపు సదరు మెగా అభిమాని ఫుల్ ఖుషీ అయ్యాడు. ఈ రకంగా పవన్ అభిమానులంటే ఆయనకెంత ప్రేమ అనేది సభాముఖంగా మరోసారి నేరుగా చూశారు మెగా ఫ్యాన్స్ అంతా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X