Bheemla Nayak Twitter Review: ఆ ఒక్క సీన్‌‌తోనే థియేటర్ దద్దరిల్లుతోంది.. ఫ్యాన్స్‌కు పవర్ఫుల్ ఫీస్ట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలయికలో వచ్చిన బిగ్గెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ భీమ్లా నాయక్ కోసం ఇన్ని రోజులు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూసారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మొత్తానికి ఆ భీమ్లా డే రానే వచ్చింది. భీమ్లా నాయక్ సినిమా మొదట ఓవర్సీస్ లో మోత మొదలుపెట్టింది. కొంతమంది ప్రీమియర్ షోలను చూసి వారి అభిప్రాయం చెబుతున్నారు. ట్విట్టర్ లో ఎక్కడ చూసినా భీమ్లా నాయక్ పేరుతో మారుమ్రోగుతోంది. ఇక నెటిజన్లు సినిమాపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అసలు సినిమా ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే...

ఆ లెక్క వేరు

ఆ లెక్క వేరు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో రీమేక్స్ వచ్చాయి. అయితే రీమేక్ సినిమా అంటే ప్రేక్షకులలో ఒక రేంజ్ వరకు మాత్రమే అంచనాలు ఉంటాయి. కానీ పవన్ సినిమాల విషయానికి వచ్చేసరికి ఆ లెక్క వేరు అనేలా ఉంది. మలయాళం హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు అంతకుమించి అనేలా అంచనాలు ఏర్పడడం విశేషం.

 మొదటి నుంచి

మొదటి నుంచి

ఈ సినిమాకు ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. రానా దగ్గుబాటి కూడా మరో పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండడం అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించడం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. ఇక థమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా అనుకున్నట్లే ప్రేక్షకులను బాగానే ఎట్రాక్ట్ చేసింది. అన్ని పాటలు కూడా థియేటర్లో ఫ్యాన్స్ చిందులు వేయడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

బొమ్మ బ్లాక్ బస్టర్

బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఇది పవన్ కళ్యాణ్ స్వాగ్, రానా దగ్గుబాటి సెటిల్డ్ పెర్ఫామెన్స్, థమన్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్,త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ సాగర్ డైరెక్షన్, ఎక్సలెంట్ క్లయిమాక్స్.. ఇలా అన్ని అంశాలు కూడా సినిమాలో మేజర్ హైలెట్ గా నిలిచాయి అని చెబుతున్నారు. సినిమా ఎక్కడ తగ్గకుండా కొనసాగుతుందని అర్ధమవుతుంది.

సెకండ్ హాఫ్ పూనకాలే

ఇక మరొక నెటిజన్ ఈ విదంగా రివ్యూ ఇచ్చాడు. పీకే హిట్ కొట్టేశాడు. సెకండ్ హాఫ్ పూనకాలే. సాగర్ కె చంద్ర డైరెక్షన్ పై కూడా ఫోకస్ పెడుతుంది. త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్ అందించిన విధానం. ఇక థమన్ ఎప్పటిలానే తన డ్యూటీ పర్ఫెక్ట్ గా చేశాడని.. అన్ని రకాల సిలిండర్స్ బ్లాస్ట్ అయ్యాయని ఫ్యాన్స్ కు ఇది మాస్ ఫీస్ట్ అని అంటున్నారు.

లాడ్జ్ ఫైట్ పై ఎక్కువగా..

భీమ్లా నాయక్ ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ కూడా అంచనాలకు తగ్గట్టుగా ఉందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక లాడ్జ్ ఫైట్ కూడా ఫ్యాన్స్ విజిల్స్ వేయడం కాయమని ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్యలో కొనసాగే ఈ యుద్ధంలో ఇద్దరు హీరోలు చాలా ఈక్వల్ గా నటించినట్లు చెబుతున్నారు. ఫ్యాన్స్ ఏ మాత్రం నిరుత్సాహ పడరని అర్ధమవుతోంది.

థమన్ మ్యూజిక్..

ఇక ఎక్కువగా అందరూ థమన్ ఇచ్చిన మ్యూజిక్ గురించే మాట్లాడుతున్నారు. థమన్ అందించిన పాటలు ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని అంటున్నారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్ కు ఎగిరి గంతేయడం ఖాయమని థమన్ మరోసారి మ్యూజిక్ అంధించడంలో ఫుల్ సక్సెస్ అయ్యారని చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X