Bheemla Nayak Censor Report: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సినిమా ఎలా వచ్చిందంటే!
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్టామినా భారీ స్థాయిలో పెరిగిపోయింది. అదే సమయంలో మన హీరోల మార్కెట్ కూడా గణనీయంగా వృద్ధి చెందింది. దీంతో మన హీరోలతో పాటు దర్శక నిర్మాతలు భారీ చిత్రాలను రూపొందించే పనిలో పడ్డారు. ఇలా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు రూపొందుతున్నాయి.
అందులో భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన 'భీమ్లా నాయక్' ఒకటి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కలయికలో రూపొందిన ఈ సినిమా వచ్చే వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ రిపోర్టు బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

భారీ మల్టీస్టారర్‌గా భీమ్లా నాయక్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటించిన భారీ చిత్రమే 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఇక, ఈ భారీ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు.

అలాంటి కథతో పవర్‌ఫుల్ రోల్స్
భీమ్లా నాయక్ మూవీ.. మలయాళంలో వచ్చిన 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే ఆధిపత్య పోరుతో ఇది రూపొందింది. ఇందులో పోలీస్ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్‌గా దగ్గుబాటి రానా నటించారు. ఇప్పటికే వీళ్లిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌కు భారీ రెస్పాన్స్ దక్కింది.

అంచనాలు భారీగా.. రిలీజ్ ఇలా
టాలీవుడ్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'భీమ్లా నాయక్' మూవీ ఫస్ట్ గ్లిమ్స్ ఆ మధ్య వచ్చింది. ఆ తర్వాత దగ్గుబాటి రానా గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ అయింది. ఇవి అభిమానులతో పాటు సినీ ప్రియుల ఆదరణను అందుకున్నాయి. అలాగే, ఆ తర్వాత వచ్చిన పాటలకు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ భారీ రేంజ్‌లో అయింది.

రిలీజ్ డేట్‌తో సర్‌ప్రైజ్ చేశారు
క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'భీమ్లా నాయక్' మూవీ విడుదల ఆంధ్రప్రదేశ్‌లో విధించిన నైట్ కర్ఫ్యూ, యాభై శాతం ఆక్యూపెన్సీ మీద ఆధారపడి ఉంటుందని నిర్మాత ప్రకటించాడు. ఈ క్రమంలోనే రెండు రిలీజ్ డేట్లను కూడా ప్రకటించారు. దీంతో ఇది ఏప్రిల్‌లో వస్తుందన్న టాక్ వినిపించింది. కానీ, ఊహించని విధంగా దీన్ని ఫిబ్రవరి 25నే రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు.

మారుమ్రోగుతోన్న భీమ్లా నాయక్
పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కాంబోలో తెరకెక్కిన 'భీమ్లా నాయక్' మూవీని ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అంతేకాదు, ఈ రిలీజ్‌ను పండుగలా జరుపుకోవాలి ప్లాన్లు చేస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా నాయక్ ఫీవర్ కనిపిస్తోంది. చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్‌కు కూడా భారీ రెస్పాన్స్ దక్కుతోంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న భీమ్లా
విడుదలకు సమయం దగ్గర పడడంతో 'భీమ్లా నాయక్' మూవీ తాజాగా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. శుక్రవారం ఈ సినిమాను సెన్సార్ బోర్డు సభ్యులు వీక్షించారు. అనంతరం ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక, ఈ భారీ మల్టీస్టారర్ మూవీ 2 గంటల 25 నిమిషాల రన్ టైమ్‌తో వస్తుందని ఇప్పటికే తెలిసింది.

సినిమా ఎలా వచ్చిందో తెలుసా?
'భీమ్లా నాయక్' మూవీని చూసిన సెన్సార్ సభ్యులు చెబుతోన్న సమాచారం ప్రకారం.. ఇది ఆద్యంతం ఆకట్టుకునే కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో పవన్ కల్యాణ్ నెవర్ బిఫోర్ రోల్‌ను చేసినట్లు తెలిసింది. అతడి విశ్వరూపానికి థియేటర్లు దద్దరిల్లిపోతాయట. పవన్‌కు ఏమాత్రం తగ్గకుండా రానా పాత్ర కూడా ఢీకొట్టే విధంగా ఉంటుందని టాక్.


Click it and Unblock the Notifications











