Bheemla Nayak Full Movie: రిలీజైన గంటల్లోనే భీమ్లా నాయక్ ఫుల్ మూవీ లీక్.. ఆ సైట్లలో డౌన్‌లోడ్ లింక్
తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'భీమ్లా నాయక్'. గత ఏడాది వకీల్ సాబ్ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా.. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రాన్ని సాగర్ కే చంద్ర తెరకెక్కించాడు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఆరంభం నుంచే భారీ అంచనాలను ఏర్పరచుకుంది. దీంతో విడుదలకు ముందే హైప్‌తో బిజినెస్‌ను భారీగా జరుపుకుంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. ఇలా వచ్చిన గంటల వ్యవధిలోనే 'భీమ్లా నాయక్' ఫుల్ మూవీ ఆన్‌లైన్‌లో లీకైంది. అంతేకాదు, ఆ సైట్లలో డౌన్‌లోడ్ లింక్ కూడా పెట్టేశారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఆధిపత్య పోరుతో వచ్చేసింది
పవన్ - రానా హీరో విలన్‌గా నటించిన చిత్రమే 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ దీనికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు డైలాగ్‌లను ఇచ్చాడు. థమన్ ఈ మవీకి సంగీతం సమకూర్చాడు. ఇక, ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో ఇది రూపొందింది.

బిజినెస్‌కు తగ్గట్లుగా విడుదల
క్రేజీ కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన 'భీమ్లా నాయక్' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు రూ. 106.75 కోట్లు బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా కలిపి అన్ని ఏరియాల్లోనూ కలుపుకుని 2000 పైగా థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా విడుదల చేసింది యూనిట్.

పాజిటివ్ టాక్.. దాహం తీరేలా
ఇగో ఉన్న ఇద్దరి మధ్య పోరుతో తెరకెక్కిన 'భీమ్లా నాయక్' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అన్ని ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఓవరాల్‌గా ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇందులో పవన్ విశ్వరూపం చూపించాడని, రానా ఇరగదీసేశాడని అంటున్నారు. చాలా రోజులుగా మాస్ ఫీస్ట్ కోసం చూస్తున్న ఫ్యాన్స్‌కు దాహం తీరేలా దీన్ని రూపొందించారు.

ఓపెనింగ్ డే రికార్డులు బద్దలే
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'భీమ్లా నాయక్' మూవీకి అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్సే వస్తోంది. అలాగే, ఈ చిత్రానికి రివ్యూలు కూడా పాజిటివ్‌గా వస్తున్నాయి. దీనికితోడు తెలంగాణలో ఐదు షోలు ప్రదర్శితం కాబోతున్నాయి. దీంతో ఈ సినిమాకు మొదటి రోజు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కాబోతున్నాయి.

భీమ్లా నాయక్‌కు ఎదురుదెబ్బ
పవన్ - రానా నటించిన 'భీమ్లా నాయక్' మూవీ ఎన్నో అంచనాలతో, భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. దీంతో ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయిపోయింది.

ఆన్‌లైన్‌లో ఫుల్ మూవీ లింక్స్
చాలా ఏళ్లుగా పైరసీని ప్రోత్సహిస్తోన్న తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్ వంటి సంస్థలు ఎన్నో చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'భీమ్లా నాయక్' మూవీని కూడా లీక్ చేసేశాయి. ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని గంటల్లోనే డౌన్‌లోడ్ లింక్‌ను కూడా పెట్టేశాయి. దీని ప్రభావం మూవీ కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో చూపించే ప్రమాదం కూడా ఉందనే చెప్పుకోవాలి.

రిపోర్టు చేస్తున్న పవన్ ఫ్యాన్స్
తెలుగు రాష్ట్రాల్లో 'భీమ్లా నాయక్' మూవీ మ్యాట్నీ షోలు కూడా ఇంకా పడలేదు. కానీ, ఈ సినిమా మాత్రం అప్పుడే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయింది. దీంతో పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా అభిమానులు దీనిపై రిపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు, పైరసీని ప్రోత్సహించవద్దని సూచిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల లింక్‌లను సైట్ల నుంచి తొలగించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











