Bheemla Nayak OTT: చరిత్ర సృష్టించిన భీమ్లా నాయక్.. ఇండియాలోనే తొలి సినిమాగా రికార్డు

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా స్టార్‌డమ్‌ను చూపిస్తూ బడా హీరోగా వెలుగొందుతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆ మధ్య కొంత గ్యాప్ తీసుకుని సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ హీరో.. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే 'భీమ్లా నాయక్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

దగ్గుబాటి రానా కూడా నటించిన ఈ సినిమా మంచి టాక్‌తో పాటు కలెక్షన్లనూ బాగానే రాబట్టింది. అయితే, ప్రతికూల పరిస్థితుల కారణంగా బ్రేక్ ఈవెన్‌ను మాత్రం దాటలేకపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా 'భీమ్లా నాయక్' మూవీ ఓటీటీలో సరికొత్త చరిత్రను సృష్టించింది. తద్వారా ఇండియాలోనే నెంబర్ వన్ మూవీగా నిలిచింది. ఆ వివరాలు మీకోసం!

 బిగ్ మల్టీస్టారర్‌గా ‘భీమ్లా నాయక్'

బిగ్ మల్టీస్టారర్‌గా ‘భీమ్లా నాయక్'

పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో వచ్చిన మల్టీస్టారర్ మూవీనే 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలను కూడా రాశారు.

 ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా

మల్టీ స్టారర్‌గా రూపొందిన 'భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్‌ను చేసుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

ఆంధ్రా, తెలంగాణలో ఫుల్ రన్‌లో 'భీమ్లా నాయక్' రూ. 76.84 కోట్లు వసూలు చేసింది. మిగిలిన ప్రాంతాల్లో నిరాశనే ఎదుర్కొంది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.24 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.55 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ముగింపు సమయానికి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.63 కోట్లు షేర్‌తో పాటు రూ. 159.10 కోట్ల గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఫలితం ఇలా

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఫలితం ఇలా

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'భీమ్లా నాయక్'కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఫుల్ రన్‌లోనే రూ. 97.63 కోట్లు వసూలు చేసింది. అంటే ఈ సినిమా ద్వారా రూ. 10.37 కోట్లు నష్టం వచ్చింది. దీనికి కారణం టికెట్ల రేట్లే అన్నది తెలిసిందే.

ఆ 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్ మొదలు

ఆ 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్ మొదలు

పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కాంబోలో రూపొందిన 'భీమ్లా నాయక్' మూవీ నేటి నుంచే (మార్చి 24) స్ట్రీమింగ్ మొదలైంది. దీని హక్కులను సంయుక్తంగా కొనుగోలు చేసుకున్న రెండు ఓటీటీ సంస్థలు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఆహా స్ట్రీమింగ్ మొదలు పెట్టాయి. దీంతో చాలా థియేటర్లలో ఈ సినిమా రన్ ఆగిపోయింది. ఇక, ఓటీటీల్లోనూ ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.

ఆహాలో చరిత్ర సృష్టించిన మూవీ

ఆహాలో చరిత్ర సృష్టించిన మూవీ

'భీమ్లా నాయక్'కు ఆహాలో భారీ స్పందన దక్కుతోంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు, ఇది తక్కువ సమయంలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను కూడా పూర్తి చేసుకుంది. తద్వారా ఆహాలో ఈ ఘనతను అందుకున్న మొదటి ఇండియన్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు ఆహా టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X