Pawan Kalyan: సంచలనం అవుతోన్న భీమ్లా నాయక్.. రిలీజ్‌కు ముందు నేషనల్ రేంజ్‌లో!
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ప్రేక్షకుల అభిరుచిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. అందుకే కొంత కాలంగా సరికొత్త నేపథ్యాలతో వస్తున్న సినిమాలకు ఆదరణ ఎక్కువగా అందిస్తున్నారు. దీంతో దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మల్టీస్టారర్ మూవీలు, రీమేక్ చిత్రాలు కూడా ఎక్కువయ్యాయి. ఇప్పుడు అలా వస్తున్న సినిమాల్లో 'భీమ్లా నాయక్' ఒకటి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పాటు దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా తాజాగా సంచలనం అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

క్రేజీ కాంబోలో భీమ్లా నాయక్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కలయికలో తెరకెక్కుతోన్న భారీ చిత్రమే 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేస్తున్నారు.

దానికి రీమేక్... హీరోల రోల్స్
భీమ్లా నాయక్ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఇది ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే ఆధిపత్య పోరుతో రూపొందుతోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్.. లోకల్ డాన్‌గా దగ్గుబాటి రానా కనిపించనున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్ రివీల్ అయ్యాయి.

అంచనాలు తగ్గట్టే బిజినెస్
క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భీమ్లా నాయక్' ఫస్ట్ గ్లిమ్స్ ఆ మధ్య వచ్చింది. ఆ తర్వాత దగ్గుబాటి రానా గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ అయింది. ఇవి అభిమానులతో పాటు సినీ ప్రియుల ఆదరణను అందుకున్నాయి. అలాగే, ఆ తర్వాత వచ్చిన పాటలకు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా భారీగా జరిగింది.

ఆ రెండు డేట్లలో ఒకటి ఫిక్స్
భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న 'భీమ్లా నాయక్' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తామని ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

అభిమానుల్లో అయోమయం
టాలీవుడ్‌లోనే ఎంతో ప్రత్యేకంగా రూపొందిన 'భీమ్లా నాయక్' మూవీ విడుదల ఆంధ్రప్రదేశ్‌లో విధించిన నైట్ కర్ఫ్యూ, యాభై శాతం ఆక్యూపెన్సీ ఎత్తివేత మీద ఆధారపడి ఉంటుందని నిర్మాత ఇటీవలే ప్రకటించాడు. దీంతో అది ఎప్పుడు వెనక్కి తీసుకుంటారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఫ్యాన్స్ మాత్రం దీనిపై అయోమయంగా కనిపిస్తున్నారు.

సంచలనంగా రిలీజ్ డేట్
'భీమ్లా నాయక్' మూవీపై ఏ మేర అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో BheemlaNayakOn25thFeb అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీ ట్యాగ్ దేశ వ్యాప్తంగా టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతూ సంచలనంగా మారిపోయింది.


Click it and Unblock the Notifications











