»   » పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్: భారీ కేక్ (ఫోటో)

పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్: భారీ కేక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. కాకినాడలో ఫ్యాన్స్ తమ అభిమాన హీరో 44వ పుట్టినరోజు సందర్భంగా 44 అడుగుల పొడవైన కేక్ తయారు చేయించారు. 550 కేజీల బరువుతో తయారైన ఈ కేకుపై పవన్ కళ్యాణ్ పేరుతో పాటు జనసేన పార్టీ లోగో ముద్రించారు. జెఎన్‌టియూ స్టూడెంట్స్ దీన్ని స్పెషల్ గా ప్రిపేర్ చేసారు. ఈ కేకును క్యాంపస్ లో ప్రజల సందర్బనార్థం ఉంచారు.

ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు వివిధ ప్రాంతాల్లో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదానం, అన్నదానం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ అభిమానులు బిజీ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం పుట్టినరోజు వేడుకలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.

Pawan Kalyan Birthday 44 Feet special Cake in Kakinada

1971 సెప్టెంబర్ 2న జన్మించిన పవన్ కళ్యాణ్ 1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యిన పవన్ కళ్యాణ్ హిట్, ప్లాప్ లతో సంభంధం లేని స్టార్ హీరోగా ఎదిగారు. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'సుస్వాగతం', 'బద్రి' మరియు 'ఖుషి', గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాదించి సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగారు. పవన్ కళ్యాణ్ కి అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మరియు ఫ్యాన్స్ కు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు.

చిరంజీవి వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టినప్పటికీ, తనకంటూ ప్రత్యేకమైన స్టయిల్‌తో యువతరం అభిమాన హీరోగా మారి, 'ఖుషి'తో అనూహ్యమైన క్రేజ్‌నూ, ఇమేజ్‌నూ సొంతం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. సాహిత్యాభిమాని కూడా అయిన కల్యాణ్‌లో ఉన్న సృజనాత్మక శక్తి ఆయనను దర్శకత్వం వైపు మళ్లించింది.

టాలీవుడ్ లో పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ విభిన్నమైనది. పవన్ కళ్యాణ్ క్రేజ్ కు హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేదు. పవన్ సినిమాకు ఉన్న స్టామినా, రేంజ్ చాలా ఎక్కువే. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలే అందుకు నిదర్శనం. తెలుగు చలన చిత్ర సీమలో ఎవరికీ దక్కనటువంటి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్.

English summary
Pawan Kalyan birthday celebrations have touched the new highs everywhere. According to reports, a 44 Feet cake weighing 550 Kgs is specially prepared by JNTU Campus students and the same is arranged for public viewing in the campus.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu