పవన్‌ను వాడుకుంటున్నారు, గిఫ్టులే గిఫ్టులు (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2ను పురస్కరించుకుని గిఫ్టుల మీదన గిఫ్టులు వచ్చి పడుతున్నాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్‌కు పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం ఇష్టం ఉండదు. అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజును బేస్ చేసుకుని ఆయన వెల్ విషర్స్, నిర్మాతలు తమ తమ సినిమాలకు ప్రచారం కల్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ బర్త్ డేను తమకు అనుకూలంగా, తమ సినిమాలకు ప్రచారం కల్పించుకోవడానికి వాడుకుంటున్నారన్నమాట. పవన్ కళ్యాణ్ బర్త్ డే గిఫ్ట్ అనగానే అభిమానుల్లో ఏదో తెలియని ఆసక్తి నెలకొనడం సహజం. దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ బర్త్ డే పేరు చెబుతూ...మెగా అభిమానులకు ఎవరెవరు ఏమేం గిఫ్టులు ఇస్తున్నారో స్లైడ్ షోలో చూద్దాం...

గోపాలా గోపాలా
పవన్ కళ్యాణ్, వెంకటేష్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ‘గోపాలా గోపాలా' చిత్రం ఫస్ట్ లుక్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పుస్కరించుకుని సెప్టెంబర్ 2న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

నాగబాబు
తమ్మడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని తన కొడుకు నటిస్తున్న ‘ముకుంద' టీజర్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు.

రేణు దేశాయ్
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజున తన తాజా సినిమా ‘ఇష్క్ వాలా లవ్' టీజర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

పవన్ కళ్యాణ్ అంటే క్రేజ్
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో పవన్ కళ్యాణ్ అత్యధిక ఫాలయింగ్ ఉంది. అందుకు ఆయన పుట్టినరోజును అంతా ఇలా వాడేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications