పవన్ కళ్యాణ్ బర్త్ డేకి జూ ఎన్టీఆర్ పార్టీ..
పవన్ కళ్యాణ్ పుట్టినరోజయిన సెప్టెంబర్ 2న జూ ఎన్టీఆర్ పార్టీ చేసుకున్నాడు. దుబాయ్, ఇస్తాన్ బుల్, టర్కీ దేశాల్లో విహారానికి వెళ్లి కావలసినంత ఎంజాయ్ చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ఎన్టీఆర్ ఎందుకు పార్టీ చేసుకుంటాడని అనుకుంటున్నారా? నిజానికి ఎన్టీఆర్ సెలబ్రేట్ చేసింది పవన్ బర్త్ డే కాదు. తన తండ్రి హరికృష్ణ బర్త్ డే. పవన్, హరికృష్ణ ఇద్దరూ సెప్టెంబర్ 2నే పుట్టారు. వైరి హీరోలైన చిరంజీవి, బాలకృష్ణల ఇంట్లో ఒకరి తమ్ముడు, మరొకరి అన్నయ్య ఒకే రోజున పుట్టడం విశేషమే కదూ? పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజుని పూణె లో భార్య రేణుదేశాయ్ కుటుంబంతో కలిసి జరుపుకున్నాడు.
పవన్ కళ్యాణ్ జూ ఎన్టీఆర్ హరికృష్ణ చిరంజీవి బాలకృష్ణ పులి బృందావనం pawan kalyan jr ntr harikrishna chiranjeevi balakrishna puli brindavanam


Click it and Unblock the Notifications