జగన్.. నా సినిమాలు ఆపితే ఆపుకో.. భగత్ సింగ్ వారసుడిని.. నాకు పొగరు.. పవన్ కల్యాణ్ ధ్వజం

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అటు సినిమాలు, ఇటు రాజకీయ ప్రచార యాత్రలతో బిజీ బిజీగా మారిపోయాడు. గత కొద్ది రోజులుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగుతో బిజీగా మారిపోయిన పవర్ స్టార్.. కీలక సన్నివేశాల షూట్‌ను పూర్తి చేసుకొని ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాడు. నాలుగో విడుత వారాహి విజయయాత్రను ప్రారంభించిన ఆయన జగన్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ మాట్లాడిన విషయాల్లోకి వెళితే..

ఇప్పటికే మూడు విడుతల వారాహి విజయ యాత్రను సక్సెస్‌ఫుల్‌గా ముగించిన పవన్ కల్యాణ్ నాలుగో విడుత యాత్రను అవనిగడ్డలో ప్రారంభించారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత అధికారికంగా తెలుగుదేశంతో పొత్తు ప్రకటించిన తర్వాత ఈ యాత్ర మొదలుపెట్టడంతో అన్ని వర్గాల దృష్టి పవన్ కల్యాణ్‌పై పడింది.

Pawan Kalyan blast on YS Jagan at 4th Varahi Vijaya Yatra at Avanigadda of Krishna District

రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వైసీపీ నేతలు ఆ సమస్యల గురించి మాట్లాడరు. కానీ నన్ను, నా బిడ్డలను దూషిస్తారు. ఈ తిట్లన్నీ ఎందుకు భరిస్తున్నానంటే.. మీ కోసమే అని పవన్ కల్యాణ్ అన్నారు. జగన్, వైసీపీ నేతలు తిట్టినా నన్ను టార్గెట్ చేసినా నేను వారికి లొంగను అని పవర్ స్టార్ స్పష్టం చేశారు.

Pawan Kalyan blast on YS Jagan at 4th Varahi Vijaya Yatra at Avanigadda of Krishna District

పవన్ కల్యాణ్ వెళ్లి వైఎస్ జగన్‌ను ముందు కూర్చోవాలని ప్రయత్నిస్తుంటారు. నా ముందు పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా ముందు కూర్చొబెట్టారని జగన్ ఆనందపడి పోతాడు. కానీ పవన్ కల్యాణ్ ఎవరికి తలవంచడు. ఎందుకంటే పవన్ కల్యాణ్‌కు పొగరు. నా తండ్రి ముఖ్యమత్రి కాదు.. సాధారణ కానిస్టేబుల్. ఓ కానిస్టేబుల్ కొడుకు ఈ స్థాయికి ఎదిగాడంటే.. ఆత్మగౌరవం ఉంటుంది అని పవన్ కల్యాణ్ అన్నాడు

Pawan Kalyan blast on YS Jagan at 4th Varahi Vijaya Yatra at Avanigadda of Krishna District

కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన నేను.. నా ఆత్మ గౌరవాన్ని ఎవరికి తాకట్టు పెట్టాను. నేను భగత్ సింగ్ వారసుడిని. జగన్ లాంటి వాళ్లకు భయపడను. నా సినిమాలు ఆపితే ఆపండి పో అనుకొంటాను. నాకు డబ్బు రాకుండా చేయాలనుకొంటే.. చేసుకో పో అని అనుకొంటాను. నా సినిమాలు ఆపుకొంటావా? ఆపుకో.. నేను భయపడుతానని అనుకోవద్దు. నువ్వు నన్నేం చేయలేవు జగన్ అంటూ పవన్ కల్యాణ్ ఛాలెంజ్ విసిరారు.

Pawan Kalyan blast on YS Jagan at 4th Varahi Vijaya Yatra at Avanigadda of Krishna District

ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలను ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X