పవన్ కళ్యాణ్ మౌనం: ఆ రోజు కోసం మెగా ఫ్యాన్స్!
హైదరాబాద్: మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మద్య విబేధాలు ఉన్నాయంటూ గత కొంత కాలంగా వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అనేక సందర్భాల్లో తమ మధ్య అలాంటివేమీ లేవని....మెగా హీరోలు స్పష్టం చేసారు. చిరంజీవి, రామ్ చరణ్ స్వయంగా ఈ విషయాన్ని పలు సందర్బాల్లో వెల్లడించారు.
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వార్తలపై ముందు నుండీ మౌనంగానే ఉంటూ వస్తున్నారు. మరో వైపు అన్నయ్య చిరంజీవి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పవన్ ప్రచారం చేయడం, సొంతగా జనసేన పార్టీ స్థాపించడంతో.....చిరంజీవికి, పవన్ కళ్యాణ్ కి పడటం లేదనే వార్తలు బలపడ్డాయి. పలు మెగా ఫ్యామిలీ ఈ వెంట్లకు పవన్ కళ్యాణ్ గౌర్హాజరవ్వడంతో ఈ వార్తలు మరింత ముదిరాయి.

అయితే ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు నేతృత్వంలో జరిగిన మెగా అభిమానుల సమావేశంలో ఈ విషయమై ఫ్యాన్స్ ప్రశ్నించగా.....త్వరలోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేస్తానని నాగబాబు మాటిచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి 150 వ సినిమా ప్రారంభోత్సవంలో చిరు-పవన్ ఒకే వేదికపై కనిపిస్తారని అంటున్నారు.
చిరంజీవి 150వ సినిమా ప్రారంభోత్సవం సాక్షిగా తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని మెగాబదర్స్ చాటి చెప్పబోతున్నారని అంటున్నారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ త్వరలోనే 150వ సినిమా ప్రారంభోత్సవం జరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











