పవన్ చిత్రంలో ప్రణీత క్యారెక్టర్ ఏమిటంటే..
హైదరాబాద్ : పవన్,త్రివిక్రమ్ చిత్రంలో ప్రణీత హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తన పాత్ర గురించి ప్రణీత మాట్లాడుతూ... "ఈ చిత్రం పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్, నేను ఈ సినిమాలో ...గర్ల్ నెక్ట్స్ డోర్ పాత్రలో స్వీట్ గర్ల్ గా కనిపిస్తాను. ఆ తరవాత కన్నడలో వరుసగా రెండు సినిమాలు చేశాను. మరో రెండు సినిమాలు ఇప్పుడు చేస్తున్నాను. ఈ సమయంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్‌గారి నుంచి పిలుపొచ్చింది. పవన్ కల్యాణ్ చిత్రంలో నటించమని అడిగితే ఏ అమ్మాయైనా కాదంటుందా... వెంటనే ఒప్పేసుకున్నాను. ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా... మీ అందరికీ తెరపై సరికొత్తగా ఎప్పుడు కనిపిస్తానా అని చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాను.
అలాగే ...మొదట సినిమా కన్నడలో, తరవాత తెలుగులో అవకాశాలు వచ్చాయని చెప్పాను కదా. మూడో సినిమా ఎక్కడ వచ్చిందో తెలుసా... తమిళంలో. ఇలా మొదటి నాలుగు సినిమాలనూ మూడు భాషల్లో చేసిన కథానాయికను నేనేనేమో.
తరవాత నేను నటించిన చిత్రం తమిళంలో 'ఉదయన్'. ఇది హిట్ కావడంతో తమిళం, కన్నడల్లో వరుస అవకాశాలు వచ్చాయి.
ఇక వాటిలో ముఖ్యమైనది 'శకుని'. కార్తితో నటించిన ఈ చిత్రం నా కెరీర్లోనే భారీ చిత్రం. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమాకోసం...తమిళనాడు రాజకీయాలపై అధ్యయనం కూడా చేశాను తెలుసా. ఇది ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్లలో విడుదలైంది. మనపేరు ప్రపంచమంతా మారుమోగిపోతుంటే ఎలా ఉంటుంది చెప్పండి... చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది అని చెప్పింది.


Click it and Unblock the Notifications











