BRO Teaser: ఏంటి 'బ్రో'.. టీజర్ కే ఇట్లా ఉంటే... ఎట్లా.. ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ బ్రో. నిన్ననే ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ టీజర్ నెట్టింట ట్రెండింగ్ మారింది. ఎక్కడ చూసిన పవన్ కల్యాణ్ డైలాగ్స్, ఫోటోస్ వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ఈ టీజర్ రికార్డ్ వ్యూస్ తో దూసుకువెళ్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

అంచనాలు రెట్టింపు...:ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓవైపు సినిమాలతో బిజీ ఉండగా.. మరోవైపు ఏపీ రాజకీయాల్లో బిజి బిజిగా గడపుతున్నారు. ఇటీవల వారాహి యాత్ర అంటూ ఓ పొలిటికల్ టూర్ ను కూడా స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో టీజర్ నిన్న రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ అయితే సినిమాపై ఆసక్తిని కలగించగా.. తాజాగా ట్రైలర్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి.

Pawan kalyan Bro Teaser is released and hits record views

ట్రెండింగ్ అవుతున్న టీజర్:వినోధయ్ సీతమ్‌ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మేకర్స్ రిలీజ్ చేసిన బ్రో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. పవన్ వింటేజ్ లుక్స్, తేజ్ కామెడీ టైమింగ్, తమన్ మ్యూజిక్, సముద్రఖని షాట్స్, త్రివిక్రమ్ డైలాగులు.. ఆకట్టుకుంటున్నాయి. కాలం ఇంద్ర జాలం అంటూ పవన్ పలికే డైలాగ్.. దానికి తోడు తమన్ అందించిన మ్యూజిక్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Pawan kalyan Bro Teaser is released and hits record views

రికార్డు వ్యూస్:అయితే తాజాగా ఈ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధించినట్లు తెలుస్తోంది. ఏకంగా 20 మిలియన్స్ అంటే.. 2 కోట్ల మంది ఈ టీజర్ ను చూసినట్లు. ఇదే కాకుండా ఈ టీజర్ కు 500కె లైక్స్ రాగా... 14,047 కామెంట్స్ వచ్చాయి. ఇక యూట్యూబ్ లోనే ఇలా ఉంటే.. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి వేదికల్లో కలిపి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించలేం. అయితే ఇది పవన్ కల్యాణ్ సినిమా అందులోనూ మేనల్లుడితో కలిసి మల్టీ స్టారర్ మూవీ కావడంతో సినిమాపై అందరికీ ఆసక్తి కలిగింది.

Pawan kalyan Bro Teaser is released and hits record views

ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో:తమిళి సినిమా వినోదయ సీతంకు రీమేక్ గా ఈ బ్రో సినిమా తెరకెక్కింది. బ్రో చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్‌, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు నేటివిటీకి అనుగుణంగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మార్పులు చేసినట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X