BRO: The Avatar motion poster review పవన్ కల్యాణ్ మెడలో ఓంకారం.. ఊర మాస్ లుక్‌.. నెంబర్ 1 ట్రెండింగ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రానికి BRO ది అవతార్ అనే టైటిల్‌ను పీపుల్స్ మీడియా ప్రకటించింది. సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో రూపొందిన వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెలుగులో తెరకెక్కింది. భక్తుడి కోసం భగవంతుడు భువికి దిగి వచ్చిన కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్, మోషన్ పోస్టర్ రివీల్‌ చేస్తూ అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మోషన్ పోస్టర్ ఎలా ఉందంటే?

ఓం అనే లాకెట్: నలుపు రంగు డ్రస్‌లో కళ్లకు గాగుల్స్ ధరించి స్టైలిష్‌గా పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. చేతులు ఓపెన్ చేసి స్టయిల్‌తో నడిచి వస్తున్న పోస్టర్‌ను ఫస్ట్ లుక్‌గా విడుదల చేశారు. మోషన్ పోస్టర్‌లో కనిపించిన ప్రకారం.. మెడలో ఓం అనే లాకెట్ ధరించడం పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. మొత్తానికి భక్తితో కూడిన మూడ్‌ను మోషన్ పోస్టర్ రివీల్ చేసింది.

Pawan Kalyans BRO the avatar Title and motion poster review

కాల: అంటూ పద్యంతో పవర్‌ఫుల్‌గా: కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం అంటూ పద్యంతో మోషన్ పోస్టర్ పవర్ ఫుల్‌గా కనిపించింది. మెగా, పవర్ ఫ్యాన్స్‌కు మంచి పండుగ లాంటి ఫీలింగ్‌ను కలిగించింది. తాజా లుక్‌తో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కోసం ఎదురు చూపులు మొదలయ్యేలా చేశాయి. విడుదలైన కొద్ది నిమిషాలకే ఇండియావైడ్ నంబర్ 1 ట్రెండింగ్‌గా మారింది.

Pawan Kalyans BRO the avatar Title and motion poster review

దివి నుంచి భువికి వచ్చిన దేవుడు: Bro బ్రో సినిమా మోషన్ పోస్టర్ చాలా ఎమోషనల్‌గా కనిపించింది. హిందు మతానికి సంబంధించిన కీర్తనలు, పురాణాల ఆధారంగా రూపొందిన భక్తి గేయాన్ని మోషన్ పోస్టర్‌కు యాడ్ చేసి అంచనాలు పెంచేశారు. తన భక్తుడి కోసం దివి నుంచి భువికి వచ్చిన దేవుడు కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది.

తమన్ బీజీఎం కేక: నటుడు సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన బ్రో సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా కథలో మార్పులు చేశారు. ఈ సినిమాకు తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. మోషన్ పోస్టర్‌లో బ్యాక్ డ్రాప్‌లో బ్రో అంటూ వినిపించిన శబ్దం కేక పెట్టించింది. మోషన్ పోస్టర్‌కు అందించిన బీజీఎం సూపర్బ్‌గా ఉంది.

జూలై 28న రిలీజ్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల రూపొందిస్తున్న BRO చిత్రం జూలై 28వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ టైటిల్, మోషన్ పోస్టర్ ప్రకటనతో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకోనున్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ విభాగాన్ని పర్యవేక్షించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X