twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ అభిమానులకు పవన్ ఇస్తున్న బంపర్ గిప్ట్ ‘పంజా’..!

    By Sindhu
    |

    సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియావర్క్స్ సంయుక్త నిర్మాణంలో నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ పవన్‌ కల్యాణ్ "పంజా" చిత్రాన్ని నిర్మించారు. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ లో యూనిట్ మొత్తం ఫుల్ బిజీగా వున్నారు. తమిళంలో స్టయిలిష్ డైరెక్టర్‌ గా పేరు తెచ్చుకున్న విష్ణువర్థన్ ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ను చాలా కొత్తగా ప్రెజెంట్ చేసారని ప్రచారం జరిగింది. అదే విషయాన్ని నిర్మాతలలో ఒకరైన నీలిమ తిరుమలశెట్టి మరోసారి దృవీకరించారు.

    డిసెంబర్‌లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియో నవంబరులో తెలుగు ప్రేక్షాభిమానులను అలరించనుంది. పవన్‌కళ్యాణ్ "పంజా" ఆడియో పవన్‌కళ్యాణ్ "జల్సా" రేంజ్‌ లో ఇన్‌ స్టెంట్‍ గా అందరినీ ఆకట్టుకుంటుందని అభిమానులు ఆశీస్తున్నారు. ఈ చిత్రం రోజు రోజుకీ అభిమానుల్లో అంచనాలని స్కైహైకి చేర్చుతోంది. స్టిల్స్ విడుదలైన దగ్గర నుంచి అభిమానుల్లో అమితాసక్తిని క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం స్టోరీ లైన్ ఇదంటూ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

    వివరాల్లోకి వెళితే రాబర్ట్ జాక్సన్ గా నటిస్తున్న పవన్ ఫస్ట్ హాఫ్ లో డాన్ గానూ, సెకెండ్ హాఫ్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాధారణ యువకుడిగా కనిపించనున్నాడని, తొలి భాగం అంతా పగా, ప్రతీకారల నేపథ్యంలో సాగుతుందని, మొత్తానికి పవన్ అభిమానులకు పంజా పవన్ ఇస్తున్న బంపర్ గిప్ట్ అని సినీ వర్గాలు చెప్పుకుంటుండటం విశేషం. ఇందులో టైటిల్ సాంగ్ ని శంకర్ మహదేవన్ తో పాడించారు. సర్వత్రా ఆసక్తి పెంచుతున్న 'పంజా" ఫస్ట్ లుక్ థియేట్రికల్ ట్రైలర్ తో పాటు ఈ చిత్ర ప్రచారానికి సంబంధించిన టీసర్ట్స్, క్యాప్స్, బెల్ట్స్ దీపావళి రోజున విడుదల చేయబోతున్నారు.

    సారాజేన్ డయాస్, అంజిలీ లావానియా నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, సంగీతం: యువన్‌శంకర్ రాజా, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, కెమెరా: పీఎస్ వినోద్, ఆర్ట్: సునీల్‌బాబు

    English summary
    Recent big releases Dookudu and Oosaravelli enjoyed solo releases and good run as there is no real competition from other big stars during this season. But it looks like Pawan Kalyan is not going to enjoy such liberties as there are many big releases lined up to lock horns with Panjaa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X