twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'చలం' పుస్తకాలతో పవన్ కళ్యాణ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌కి పుస్తకాలంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ప్రస్తుతం ఆయన చలం రచనల్లో మునిగి తేలుతున్నారు. పవన్‌.. చలం సమగ్ర సాహిత్యాన్ని చదువుతున్నారు. ఈ పుస్తకాల్ని 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' చిత్రీకరణ సమయంలో నటుడు ప్రకాష్‌రాజ్‌ ఆయనకు బహూకరించారు. తన తదుపరి చిత్రం షూటింగ్ మొదలయ్యే గ్యాప్ లో ఈ పుస్తకాలను పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నట్లు చెప్తున్నారు.

    ఇక పవన్ సెట్లో కూడా కాస్త తీరిక చిక్కితే ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉంటారు. పుస్తకాలు చదవడమే కాదు... 'ఫలానా పుస్తకం బాగుంది. తప్పకుండా చదవండి' అని సన్నిహితులకు చెబుతుంటారు. అలాగే మార్క్స్‌ భావనలంటే ఇష్టపడే పవన్‌... ఆ సిద్ధాంత గ్రంధాలను తిరగేస్తుంటారు. అభ్యుదయ గేయాలంటే చాలా ఇష్టం. ఆయన సన్నిహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్తగా వచ్చిన పుస్తకాలలో తాను చదివిన వాటిలో మంచివి రిఫెర్ చేస్తూండటం, ఓ కాపీ పంపడం చేస్తూంటారు.

    పవన్ బుక్ రీడింగ్ గురించి పూరీ మాట్లాడుతూ....నాకు తెలిసి పవన్‌ చదివినన్ని పుస్తకాలు మరే ఇతర హీరో చదివి ఉండడు. నేను మర్చిపోయిన కొన్ని తెలుగు పదాలు కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. పుస్తకాలు విరివిగా దొరికే ఓ వైబ్‌సైట్‌ పేరు చెప్పారు. ప్రకాష్‌రాజ్‌ నాకూ, పవన్‌కీ చలం పుస్తకాలన్నీ కానుకగా పంపించారు అన్నారు.

    English summary
    
 Pawan Kalyan is a voracious reader with an insight into Maxism. Present he is reading Chalam books.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X