దసరాకి ముస్తాబవుతన్న పవన్ కళ్యాణ్ ఫోటో షూట్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను దసరా రోజున విడుదల చేయనున్నారు. దీనికోసం పవన్ కళ్యాణ్, నాయకానాయికలు సారాజేన్ డయాస్, అంజలీ లావానియాపై త్యేకంగా ఫోటో షూట్ జరుపుతున్నట్లు తెలిసింది.
సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కామీడియా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిర్మాతలు శోభు యార్లగడ్డ, తిరుమలశెట్టి నీలిమా చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'ఈ చిత్రానికి షాడో, కాళి, తిలక్, పటేల్ లాంటి టైటిల్స్ బయట ప్రచారంలో వున్నాయి. ఈ టైటిల్స్‌లో వేటినీ మేము ఎంపికచేయలేదు. దసరా సందర్భంగా ఈ చిత్రానికి ఓ పవర్ ఫుల్ టైటిల్ ను ప్రకటించబోతున్నాం.
స్టైలిష్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ మేనరిజమ్స్, పాత్ర చిత్రణ అన్నీ వైవిధ్యంగా వుంటాయి. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో ఫిరోజ్ ఖాన్ నృత్యదర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సారాజేన్ డయాస్ లపై ఓ పాటను చిత్రీకరించాం.. దీంతో ఇంకా రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. నవంబర్‌లో ఆడియోను విడుదల చేసి డిసెంబర్‌లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాము" అన్నారు. జాకీవూషాఫ్, అడవి శేష్, అతుల్‌కులకర్ణి, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











