twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎయిడ్ గురించి పవన్ కళ్యాణ్, ఫ్యాన్స్ షేర్ (వీడియో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: డిసెంబర్ 1, ఎయిడ్స్‌డే‌ను పురస్కరించుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఈ వ్యాధిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం కావడంతో గతంలో ఎయిడ్స్‌పై పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ నెట్వర్కింగులో తెగ షేర్ అవుతోంది.

    సమాజానికి ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ‘పవనిజం' పేరుతో చాలా కాలంగా పలు సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ రోజు ఎయిడ్స్ డే సందర్భంగా వారు ఎయిడ్స్ మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

     Pawan Kalyan Campaign for aids programme

    పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం ఆయన ‘గోపాల గోపాల' చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈచిత్రం ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్‌' చిత్రాన్ని పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్ మల్టీ స్టారర్‌గా తెలుగులో 'గోపాలా గోపాలా'గా రీమేక్ చేస్తున్నారు.

    ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మోడరన్‌ కృష్ణుడు పాత్రలో కనిపిస్తాడు. వెంకటేష్ వ్యాపారి పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సురేష్ బాబు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మధు శాలిని, దీక్ష పంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

    English summary
    Check out video: Pawan Kalyan Campaign for aids programme.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X