పవర్ స్టార్ కు అంత సీన్ లేదా...??

By Kuladeep

టాలీవుడ్ ఇండస్ట్రీని స్వర్గీయ నందమూరి తారక రామారావు తిరుగులేని రారాజు ఏలాడు అన్న విషయాన్ని ఎవ్వరూ కాదనలేని విషయం. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాత్రమే తిరిగి టాలీవుడ్ ను ఏకఛత్రాధిపతి గా ఏలాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన రాజకీయ రంగప్రవేశం తర్వాత ఇక సినిమాల్లో నటిస్తారనే ఆశ ఇక లేనట్టే. మరి ఇప్పుడు మెగాస్టార్ స్థానాన్ని ఎవరు భర్తీ చెయ్యనున్నారు అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఆయన స్థానాన్ని నందమూరి బుడ్డోడు జూ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేదా ప్రిన్స్ మహేష్ బాబు కానీ భర్తీ చెయ్యనున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరి మెగాస్టార్ 'తమ్ముడు' పవన్ కళ్యాన్ సంగతి ఏంటి..?? ఆయన మెగాస్టార్ స్థానాన్ని భర్తీ చేస్తాడా..?? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మేము నిర్వహించిన పోల్ వివరాలు పరిశీలిస్తే పవర్ స్టార్ కు అంత పవర్ లేదేమో అనిపిస్తుంది. పోల్ వివరాలు ఓ సారి చూస్తే పవన్, చిరు స్థానాన్ని భర్తీ చేస్తాడని 47.22% మంది ఓట్ చేస్తే, అంత సీసు లేదని 49.89% మంది ఓట్ చేసారు. మరో 2.89% మంది చెప్పలేమని ఓట్ చేసారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే 'జల్సా' సినిమా తర్వాత తన అభిమానులు తిరిగి జల్సా చేసుకునే అవకాశమే ఇవ్వని పవన్, మెగాస్టార్ రేసులో నిలబడాలంటే తన తదుపరి చిత్రంలో 'పులి'లా గర్జించాల్సిందే... లేదంటే ఇప్పటికే రేసులో వెనుకబడిపోయిన పవన్ కెరీర్ ప్రశ్నార్థకంలో పడినట్టే...!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X