»   » వారిలో మార్పు వస్తుందనే చిన్న ఆశతో... పవన్ కళ్యాణ్ ప్రచారం!

వారిలో మార్పు వస్తుందనే చిన్న ఆశతో... పవన్ కళ్యాణ్ ప్రచారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మానవ జాతిని పీడిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ వ్యాధి ఒకటి. ఈ వ్యాధి భారిన పడిన ఏటా లక్షలాది మంది బలవుతున్నారు. కొన్ని రకాల అలవాట్లను మానుకోవడం ద్వారా ఈ వ్యాధి నుండి బయట పడొచ్చు, కొన్ని ముందు జాగ్రత్తల వల్ల కూడా ఈ వ్యాధి భారిన పడిన ప్రాణాలతో బయట పడొచ్చు. ఇందుకోసం క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్ల అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం.


Read Also: ఫ్యాన్స్ తప్పక చదవాలి: లీఫ్ ఇయిర్ కు, పవన్ కెరీర్ కు లింక్

ఇప్పటికే ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కూడా భాగా కాబోతున్నారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ రూపొందిస్తున్న యాడ్ ఫిల్మ్ లో పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు.


Read Also: ఎంతవరకూ నిజం?: పవన్ స్ట్రాంగ్ డెసిషన్ ..చిరంజీవి బ్రేక్ లు..టీవిల్లోకి

త్వరలో ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. పవన్ వాయిస్ ఓవర్ ఇస్తారని తెలుస్తోంది. కొన్ని రకాల అవాట్లు మానుకోవడం, ముందు జాగ్రత్తలు తీసుకునే విషయంలో ఇలా అవగాహన కల్పించడం ద్వారా ఎంతో మార్పు వస్తుందనే చిన్ని ఆశతో పవన్ కళ్యాణ్ ఈ ప్రచార కార్యక్రమంలో పాలుపంచుకొబోతున్నారు. త్వరలోనే ఈ యాడ్ ఏపి, తెలంగాణల్లోని అన్ని థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు.

Pawan Kalyan in Cancer Awareness Ad

పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మార్చిలో ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆడియో వేడుక అమరావతిలో జరిపే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్‌ 8న ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. శరత్‌ కేల్కర్‌, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి, పోసాని, ముఖేష్‌రుషి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్థర్‌ విల్సన్‌, ఆండ్రూ, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి, పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌.

English summary
Pawan Kalyan will be taking part in a social awareness program. The actor will lend his voice over for 'Cancer Awareness Ad' that will soon be shot and screened in all the theatres in Andhra Pradesh and Telangana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu