పవర్ స్టార్ నిర్లక్ష్యం...ఫ్యాన్ ఆందోళన!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ని విషయాల్లోనూ పర్ ఫెక్టుగా ఉంటారు. ఇంకొకరితో వేలెత్తి చూపించుకునే రకం కానే కాదు. వ్యక్తిత్వం విషయంలోనైనా...ఇతర విషయాల్లోనైనా ఆయన రూటే సపరేటు. అయితే ఒక విషయంలో మాత్రం పవర్ స్టార్ లేజీనెస్ ప్రదర్శిస్తున్నారు. అది మరేదో కాదు...ఆయన బాడీ ఫిట్ నెస్ గురించి.
ఖుషీ, తమ్ముడు, బద్రి సినిమాల్లో పవర్ స్టార్ ఎంత హ్యాండ్సమ్‌గా కనిపించారో...ఎంత మంది అమ్మాయిల మనసు దోచారో. అప్పట్లో పవర్ స్టార్ స్టైల్ చూసి యూత్ మొత్తం ఆయన్ను ఫాలో అయ్యేవారు. కానీ రాను రాను ఆయన తన బాడీ ఫిట్ నెస్‌పై నిర్లక్ష్యం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ మధ్య పవర్ స్టార్ కాస్త లావెక్కడమే ఇందుకు నిదర్శనం.
అయితే ఈ పరిణామాలపై పవన్ కంటే అభిమానులకే ఎక్కువ ఆందోళన ఉంది. తమ హీరో ఇతర పోటీ హీరోలకంటే అందంగా, ఫిట్‌గా ప్రతి అభిమాని కోరుకుంటాడు. అందుకే వారిలో ఈ ఆందోళన. ఈ విషయంలో పవర్ శ్రద్ధ తీసుకోవాలని తమ వంతు మాటగా చెబుతున్నారు.
ప్రస్తుతం పవర్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో తమన్నా హీరోయిన్. మరికొన్ని రోజుల్లో ఈచిత్రం షూటింగ్ పూర్తి కానుంది. ఈచిత్రంలో పవర్ స్టార్ జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











