పవన్ కళ్యాణ్ భూకంపం సృష్టిస్తున్నాడు...

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భూకంపం సృష్టిస్తున్నాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందే పొలిటికల్ భూకంపం సృష్టించాడు కదా...కొత్తగా ఇదేంటని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే...అప్పుడు ఆయన సృష్టించిన భూకంపై రియల్ లైఫ్ లో అయితే....ఈ సారి రీల్ లైఫ్‌లో సృష్టిస్తున్నాడు. ఆయన నటిస్తున్న ‘గోపాలా గోపాలా' చిత్రంలోనిది ఈ సీన్.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సీన్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. సినిమా కథలో భాగంగా భూకంపం వస్తుంది. దాని కారణం దేవుడే అంటూ కేసు వేస్తాడు ఓ వ్యాపారి. హిందీ చిత్రం 'ఓ మైగాడ్'ని తెలుగులో 'గోపాల గోపాల' టైటిల్ తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఈ చిత్రం రీమేక్ అవుతోంది. హిందీ వెర్షన్లో అక్షయ్ కుమార్ పోషించిన శ్రీకృష్ణుడి పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేయగా, పరేష్ రావల్ పోషించిన వ్యాపారి పాత్రలో వెంకటేష్ నటించాడు.

Pawan Kalyan caught in Earthquake

సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీక్షాపంథ్‌, మధుశాలిని ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్‌ పలికే సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. వెంకటేష్ మరో హీరోగా చేస్తున్న సినిమాలో పవన్ పాత్ర కేవలం 25 నిముషాలేట. అయితే ఇప్పుడు అభిమానులు నిరాశపడతారని దాని నిడివి పెంచినట్లు సమాచారం. ఆ పాత్ర ఇప్పుడు సెకండాఫ్ లో దాదాపు పూర్తిగా ఉంటుంది. కీలకమైన సన్నివేశాల్లో దాదాపు 45 నిముషాల సేపు కనపిస్తాడట. ఇరవై నిముషాల సేపు ఆయన పాత్ర నిడివి పెంచారని సమాచారం.

ఈ చిత్రంలో శ్రియ ముఖ్యపాత్రలో కనిపిస్తుంది. కృష్ణుడు, మధుశాలిని, వెన్నెల కిషోర్‌, దీక్షా పంత్‌ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: శరత్‌మరార్, సురేష్‌బాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X