పవన్ కళ్యాణ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇలా.. (ఫోటో)

By Bojja Kumar

మైదరాబాద్: పవన్ కళ్యాణ్ ఈ సారి సంక్రాంతి సంబరాలను తన ఫాం హౌస్ లో జరుపుకుంటున్నారు. తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఇక్కడే గడుపుతున్నారు. ఆయనకు పచ్చని చెట్ల మధ్య ప్రకృతిలో మమేకమవ్వడం అంటే ఎంతో ఇష్టం. అందుకే సమయం దొరికినప్పుడల్లా ఫాం హౌస్ బాట పడుతుంటారు. ఈ సంక్రాంతి సందర్భంగా ఆయన ఫాం హౌస్ లోనే తిష్టవేసారు. గాలి పటాలు ఎగర వేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూడొచ్చు. రైతు కన్నీరు పెట్టని గ్రామీణ భారతం రావాలని ఆశిస్తూ....అందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు.

Pawan Kalyan Celebrates Sankranti at form house
పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల' చిత్రం మంచి విజయం సాధించడంతో ఆయన అభిమానులు, సినిమా నిర్మాతలు, టెక్నీషియన్స్, ఇతర నటీనటులు సంక్రాంతి మరింత హ్యాపీగా జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఈచిత్రం బాగా ఆడుతోంది. చెన్నై బాక్సాఫీసు వద్ద కూడా దుమ్ము రేపుతోంది. సంక్రాంతి సీజన్ కావడంతో ఫ్యామిలీ ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉందని అంటున్నారు. గోపాల గోపాల' చిత్రానికి కిషోర్‌ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. అయితే ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం కలెక్షన్స్ యావరేజ్ గా ఉన్నాయని టాక్.

మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X