twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కెమెరామెన్ గంగతో...’ యూఎస్‌లో రికార్డు ధర

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం సూపర్ హిట్టయి అమెరికా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన నేపథ్యంలో పవన్ తర్వాతి సనిమా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రానికి అక్కడ భారీ డిమాండ్ ఏర్పడింది.

    ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ కోసం ఓ సంస్థ రూ. 5 కోట్లు చెల్లించేందుకు ముందుకు రాగా తిరస్కరించిన దానయ్య...అక్కడ స్క్రీన్ల వైజ్‌గా ఎక్కువ మందికి అమ్మడం ద్వారా ఎక్కువ డబ్బులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

    తాజాగా ఈచిత్రాన్ని అమెరికాలో 13 సెంటర్లలో ప్రదర్శించడానికి $260k(around 1.3 crores) ధరకు అమ్మారు. మరిన్ని స్క్రీన్లకు కూడా అమ్మనున్నారు. ఈ లెక్కన ఓవర్స్ రైట్స్ ద్వారా రూ. 10 కోట్లుక పైగా రాబట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

    పవర్ ఫుల్ సబ్జెక్ట్‌తో, మంచి ఎంటర్‌టైన్మెంట్, సూపర్ సాంగ్స్‌తో, థ్రిల్లింగ్ యాక్షన్‌తో ప్రేక్షకులు, పవన్ అభిమానులు అందరూ మెచ్చే విధంగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' రూపొందుతోంది. ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయి. పూరి జగన్నాథ్ పవర్ స్టార్ కోసం రాసిన సూపర్ డైలాగలకు థియేటర్లు చప్పట్లతో దద్దరిల్లనున్నాయి.

    మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోని సెప్టెంబర్ 15న విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక సమాచారం వెలువడనుంది. అక్టోబర్ 11న ఈచిత్రం విడుదల కానుంది.

    ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Power star Pawan Kalyan's recent release Gabbar Singh, which is a remake of Salman Khan's Dabangg, has set new collection record at the Box Office. The huge success of the movie has created lot of demand for the rights of his upcoming film Cameraman Ganga Tho Rambabu, which is slated to release on 11 October. We hear that its theatrical rights of USA have been sold for a record price. In a chat with a leading English day, DVV Danayya, who is producing Cameraman Ganga Tho Rambabu, has revealed that he has sold its rights for $260k for screening in 13 centres in the country.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X