twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్స్ కు పండుగ: పుట్టినరోజు వేడుకకు పవన్‌ కళ్యాణ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : చిరంజీవికి, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ కు విభేధాలు ఉన్నట్లు మీడియాలో చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతె తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ రూమర్స్ ని ప్రత్యక్ష్య ఖండన లాంటి ఈవెంట్ ఒకటి జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది మరేదో కాదు. మెగాస్టార్‌ చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకల్లో చిరు కుటుంబసభ్యులతోపాటు పవన్‌కల్యాణ్‌ కూడా పాల్గొంటారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ విషయాన్ని ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రమణం స్వామినాయుడు మీడియాకు తెలిపారు. ఆదివారం నెల్లూరులో జరిగిన చిరంజీవి యువత కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు.

    ఆయన మాట్లాడుతూ.... ఆగస్టు 22వ తేది హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగే చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో అభిమానులు భారీస్థాయిలో పాల్గొంటారని అన్నారు. ఈ వేడుకలకు పవన్‌కళ్యాణ్‌ కూడా వస్తున్నారని నాగబాబు తెలిపారన్నారు.

    Pawan Kalyan cheif guest to Chiranjeevi Birthday

    చిరంజీవి 150 సినిమా టైటిల్ అది కాదు...

    స్వామి నాయుడు 150 వ చిత్రం విషయమై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..ప్రజలందరూ అనుకునే విధంగా చిరంజీవి 150వ సినిమా పేరు ఆటోజాని కాదని, అది అభిమానులు సృష్టించిన పేరేనని చెప్పారు.

    ఇక ... చిరంజీవి పుట్టిన రోజున అంటే ఆగస్టు 22 న ఈ చిత్రం ప్రారంభం జరగనుందని సమాచారం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన 150 వ చిత్రం గురించి ఎన్నో కథలు,కథనాలు మీడియాలో వచ్చాయి...వస్తూనే ఉన్నాయి. వేటికీ చిరంజీవి అవుననలేదు...కాదనలేదు. ఆయన మాత్రం తన శరీరాన్ని సినిమాకు తగినట్లు మార్చుకునే పనిలో పడిపోయారు. అదే స్పీడులో స్క్రిప్టుని సైతం ఓకే చేసి రోజూ ఆ స్క్రిప్టు పై కూర్చుంటున్నట్లు సమాచారం.

    చిరంజీవి 60వ జన్మదిన వేడుకలను ఆగస్టు 22న ఘనంగా నిర్వహించాలని అఖిల భారత చిరంజీవి యువత జాతీయ అధ్యక్షుడు స్వామినాయుడు చెప్పారు. ఆగస్టు 2న హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల ముఖ్య పట్టణాల్లో చిరంజీవి జన్మదిన వేడుకలను ప్రారంభించాలని నిర్ణయించారు. జిల్లాస్థాయిలో, రాష్ట్రస్థాయిలో పాటలు, నృత్య పోటీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

    ఇక చిరు 150 చిత్రం గురించి మీడియాలో ...

    చిరంజీవి 150 వ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు అని ఖారరు అయిన ఈ సమయంలో ...ఆయన్ని మార్చారంటూ వార్తలు వచ్చి అభిమానులను కలవరపెడుతున్నాయి. దీనికి కారణం ..ఛార్మితో పూరి చేసిన జ్యోతి లక్ష్మి చిత్రం వర్కవుట్ కాకపోవటమే అని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ...పూరి ని కాదనుకుని వివి వినాయిక్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ మేరకు వినాయిక్ తో చర్చించినట్లు సమాచారం.

    ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడేదాని ప్రకారం... ఇటీవల ఛార్మితో పూరి రూపొందించిన 'జ్యోతిలక్ష్మీ' చిత్రాన్ని చూసిన తర్వాత 150వ చిత్రానికి పూరితో కాకుండా వినాయక్‌తో వెళ్తే బెటరని చిరు అనుకున్నారని తెలిసింది. అంతేకాదు వినాయక్‌తో ఓ రోజంతా చర్చించినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇది ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది.

    చిరుతో తను చేసే 150వ చిత్రానికి కథ రెడీ అయ్యిందని, ఇప్పడికే పస్టాఫ్‌ని చిరు పక్కాగా ఓకే చేశారని కూడా పూరి ప్రకటించిన సంగతి తెలిసిందే. షూటింగ్‌ పరంగా చిరు 150వ చిత్రం షూటింగ్‌కి ఇంకా రెండు నెలల వ్యవధి ఉండటంతో, ఈ గ్యాప్‌లో నితిన్‌తో సినిమా చేయాలని పూరి డిసైడ్‌ అయిపోయి, నితిన్‌తో సినిమా చేస్తున్నట్టు కూడా ప్రకటించేశాడు.

    అయితే కొద్ది రోజుల క్రితం నితిన్‌తో కాదు వరుణ్‌తేజ్‌తో సినిమా చేస్తున్నానంటూ పూరీ మళ్ళీ ప్రకటన చేశారు. అంతేకాదు...ఇలా హటాత్తుగా ఉన్నట్టుండి హీరో మారిపోవడానికి, ప్రాజెక్ట్‌ కూడా వేరే బ్యానర్‌కి వెళ్ళిపోవడానికి ఛార్మినే కారణమంటూ వార్తలొచ్చాయి. ఈ విషయంలో ఛార్మి ట్విట్టర్‌ ద్వారా నితిన్‌కి క్షమాపణలు చెప్పింది కూడా.

    అయితే తమ దగ్గర డబ్బుల్లేకపోవడం వల్లే నితిన్‌ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందనే తప్ఫుడు ప్రచారాన్ని ఛార్మి చేసినందుకు, తమకెంతో నష్టం వాటిల్లిందని, పరిశ్రమలో తమ సంస్థకి ఉన్న గౌరవం మంటగలిసిందని నితిన్‌ ఫాదర్‌ ఎన్‌.సుధాకర్‌రెడ్డి ఛాంబర్‌లో ఛార్మిపై ఫిర్యాదు చేయడమే కాకుండా, పరువునష్టం కింద యాభై కోట్లు డిమాండ్‌ చేసినట్టు సమాచారం.

    English summary
    Pawan Kalyan will be atted to Chiranjeevi's Birthday celebrations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X