పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా ఇద్దరమ్మాయిలతో...?
హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఆడియో ఈ నెల 28న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలుస్తోంది. అయితే ఇది అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.
ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ నటించిన 'జులాయి' ఆడియో విడుదలకు హాజరయ్యారు. ఆచిత్రం భారీ విజయం సాధించడంతో పాటు 40 కోట్ల మార్కును దాటడంతో పాటు బన్నీ కెరీర్లోనే భారీ హిట్ గా నిలిచింది. దీంతో పవన్ కళ్యాణ్ రాక తనకు కలిసొస్తుందని భావిస్తున్నాడట అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పర్సనల్ గా వెళ్లి పవన్ కళ్యాణ్‌ను ఆడియో వేడుకకు ఆహ్వానించేందుకు సిద్దమవుతున్నాడట.
బన్నీ సరసన అమలపాల్, కేథరిన్ నటిస్తున్నారు. స్పెయిన్ దేశంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించారు. ఈచిత్రంలో అల్లు అర్జున్ తన ఒంటిపై టాటూలతో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
ప్రస్తుతం ఇద్దరమ్మాయిలతో చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో పాట చిత్రీకరణ జరుపుకుంటోంది. గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ, నిర్మాత: బండ్ల గణేష్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











