చిరు, పవన్ దీపావళి సెలెబ్రేషన్స్.. పంచె కట్టులో అదుర్స్, మిస్సయ్యాడన్నది ఎవరు!
Recommended Video

మెగా బ్రదర్స్ చిరు, నాగబాబు, పవన్ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలు, రాజకీయాలు వీటన్నింటికి అతీతంగా అన్నదమ్ముల మధ్య అనుబంధం ఉంటుంది. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా అన్నయ్యని కలుసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నివాసంలో దీపావళి వేడుకలు జరిగాయి. ఆ సెలెబ్రేషన్స్ కు సంబంధించి మెగా ఫ్యామిలీ ఫోటో ఒకటి వైరల్ అయింది. అందులో పవన్ మిస్సయ్యాడు అంటూ కొందరు మెగాఫ్యాన్స్ నిట్టూర్చారు. వారందరికీ తాజగా వైరల్ అవుతున్న ఫోటో పండగలాంటిది.

దీపావళి సెలెబ్రేషన్స్
ఏ పండుగ వచ్చినా మెగా ఫ్యామిలీ మొత్తం కలసి సెలెబ్రేట్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. దీపావళి పండుగని మెగా ఫ్యామిలీ మొత్తం మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలెబ్రేషన్స్ కు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నాగబాబు, అల్లు అర్జున్ హాజరయ్యారు.

పవన్ మిస్సయ్యాడు అంటూ
మెగా ఫ్యామిలి మొత్తం ఒక ఫ్రేమ్ లో కనిపించడంతో కొంతమంది మెగా ఫాన్స్ సంబరపడినా మరికొంతమంది పవన్ మిస్సయ్యాడంటూ నిరాశ చెందారు. కానీ అన్నయ్య ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు తమ్ముడు పవన్ కూడా హాజరైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

పంచెకట్టుతో మెగా బ్రదర్స్
తాజాగా వైరల్ అవుతున్న ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పంచె కట్టులో అలరిస్తున్నారు. వైట్ షర్ట్, పంచె తో ఉన్న మెగా పిక్ చూడముచ్చటగా ఉంది. సైరా చిత్రం కోసం చిరు గుబురు గడ్డంతో కనిపిస్తుండగా, పవన్ మెడలో కండువా ధరించి పూర్తి ట్రెడిషనల్ గా కనిపిస్తున్నాడు.

బిజీ బిజీగా
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహారెడ్డి ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











