200వందల కోట్లతో రూపొందుతున్న పవన్ క్రైస్తవ చిత్రం..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'కొమరంపులి" అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ నెలలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రం తర్వాత పవన్ ఓ క్రైస్తవ చిత్రంలో నటిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఏసుక్రీస్తు" గా నటిస్తున్న కొత్త చిత్రం ఈరోజు ఇజ్రెయల్ లో ప్రారంభమైంది. ఈ సంచలనాత్మక చిత్రాన్ని ప్రముఖనిర్మాత కొండా క్రిష్ణంరాజు ఆదిత్య ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఎన్నో సంచలన చిత్రాలను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సింగీతం శ్రీనివాస రావు, పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జీసస్ జీవితం ఆధారంగా నిర్మిస్తున్న సినిమా విశేషాలను వివరించారు.
ఏసుక్రీస్తు జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ కన్నడ, మళయాళం, ఇంగ్లీష్ భాషల్లో నిర్మిస్తున్నారు. తమిళ, హిందీ భాషల్లో కూడా అగ్రకధానాయికలు ఏసుక్రీస్తు పాత్రను పోషిస్తుండడం విశేషం. అయితే పవన్ కళ్యాణ్ ఏసుక్రీస్తు పాత్రకు ఎంత వరకు న్యాయం చేస్తాడనేది చర్చనీయాంశంగా మారింది. మరి పవన్ ఏసుక్రీస్తుగా మెప్పిస్తాడో..లేదో..చూడాలి..!


Click it and Unblock the Notifications











