ఈ చిత్రంలో నాకు హీరోయిన్ ఉండదు: పవన్ కళ్యాణ్
చేసేది భక్తి రస చిత్రమైనా పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ ఉండి తీరుతుందని ఈ మధ్యన కామెంట్స్ వినపడుతున్న నేపధ్యంలో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో హీరోయిన్ లేదని పాటలుండవని స్పష్టం చేశారు. కేవలం భక్తి ప్రధాన చిత్రమైనా సస్పెన్స్ ఉంటుందని అన్నారు. తాను చేసే యాక్షన్ చిత్రాలకు ఇది భిన్నంగా ఉంటుందని అన్నారు. అలాగే తాను జెరూసలెం వచ్చింది కేవలం ఏసు ప్రభువుపై చిత్ర నిర్మాణం షూటింగ్ లో పాల్గొనేందుకేనని పవన్ కల్యాణ్ చెప్పారు.
ఇక గతంలో బాలకృష్ణతో 'విజయేంద్రవర్మ', నాగార్జునతో 'శ్రీరామదాసు' నిర్మించిన ఆదిత్య ప్రొడక్షన్స్ సంస్థ కొండా కృష్ణంరాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. జెకె.భారవి కథను సమకూర్చిన ఈ చిత్రం ఆంగ్లంతోపాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ నిర్మితమవుతుంది. దైవ కుమారుడిగా క్రీస్తు రాక నుంచి మొదలయ్యే ఈ కథలో పాత్రల కోసం 10 నుంచి 14 సంవత్సరాలలోపు బాల బాలికల్నే ఎంపిక చేస్తున్నారు. క్రీస్తు, మేరీ మాత పాత్రలకు ప్రముఖుల పిల్లల్ని తీసుకున్నట్లు తెలిసింది. 14 సంవత్సరాల బాలుణ్ని 30 సంవత్సరాల క్రీస్తుగా చూపించేందుకు ప్రత్యేక మేకప్ సూత్రాల్ని పాటించబోతున్నారు.


Click it and Unblock the Notifications











