twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి పాలిటిక్స్‌పై పవన్ షాకింగ్ కామెంట్స్: అది మాత్రం నిజమే.. జనసేనలోకి వచ్చేది చెప్పలేనంటూ!

    |

    మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే ప్రజాసేవపైనా ఫోకస్ చేస్తూ వచ్చిన వీళ్లిద్దరూ.. చాలా కాలం క్రితమే రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే, ప్రతికూల ఫలితాలు రావడంతో వెనక్కి తగ్గిన మెగాస్టార్.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. కానీ, పవర్ స్టార్ మాత్రం మరో పార్టీని స్థాపించి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై పవన్ స్పందించాడు. ఆ వివరాలు మీకోసం!

    పాలిటిక్స్ కోసం వెళ్లి.. లాయర్‌గా వస్తున్నాడు

    పాలిటిక్స్ కోసం వెళ్లి.. లాయర్‌గా వస్తున్నాడు

    చాలా రోజుల క్రితం రాజకీయాల కోసం సినిమాలకు దూరమయ్యాడు పవన్ కల్యాణ్. సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ లాయర్‌గా కనిపించనున్నాడు. దీనితో పాటు మరో మూడు చిత్రాలను కూడా లైన్‌లో పెట్టేశాడీ మెగా హీరో.

    ఆచార్యలా మారిన మెగాస్టార్.. చరణ్‌తో కలిసి

    ఆచార్యలా మారిన మెగాస్టార్.. చరణ్‌తో కలిసి

    మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న 'ఆచార్య'లో నటిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన టీజర్ రికార్డులపై దండయాత్ర చేస్తోంది.

    అప్పుడు ఇద్దరూ కలిసి ఒకే పార్టీలో ఉన్నారు

    అప్పుడు ఇద్దరూ కలిసి ఒకే పార్టీలో ఉన్నారు

    చాలా ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. కొన్ని కోట్ల మంది మధ్యలో తిరుపతిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో తన పార్టీని ప్రకటించారాయన. అప్పటి నుంచి యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ ఆయన వెంటే ఉన్నాడు. తమ పార్టీని గెలిపించుకోవడం కోసం అన్నతో కలిసి తీవ్ర స్థాయిలో ప్రచారం కూడా చేశాడు.

    పవన్ రెండు పనులు.. చిరంజీవి మాత్రం అదే

    పవన్ రెండు పనులు.. చిరంజీవి మాత్రం అదే

    కొన్నేళ్ల క్రితం జనసేన అనే పార్టీని ఏర్పాటు చేశాడు పవన్ కల్యాణ్. దాని కోసం చాలా రోజులుగా కష్టపడుతున్నాడు. ఇక, గత ఎన్నికల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావించిన అతడు.. రెండింటికీ న్యాయం చేసేలా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు, చిరంజీవి మాత్రం పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పేసి సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు.

    చిరంజీవి పాలిటిక్స్‌పై జనసేన నేత వ్యాఖ్యలు

    చిరంజీవి పాలిటిక్స్‌పై జనసేన నేత వ్యాఖ్యలు

    రెండు రోజుల క్రితం జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్.. మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ సభలో మాట్లాడుతూ.. 'ఎన్నికలు వచ్చే వరకూ సినిమాలు చేసుకో అని చిరంజీవే పవన్‌కు సలహా ఇచ్చారు. అంతేకాదు.. పాలిటిక్స్ విషయంలో ముందు నువ్వు వెళ్లు.. ఆ తర్వాత నేను కూడా వస్తాను అని చెప్పారు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

    చిరంజీవి పాలిటిక్స్‌పై పవన్ షాకింగ్ కామెంట్స్

    చిరంజీవి పాలిటిక్స్‌పై పవన్ షాకింగ్ కామెంట్స్


    జనసేన నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలతో మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు కూడా దీనిపై ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించాడు. ఈ క్రమంలోనే తన అన్న పాలిటిక్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

    అది మాత్రం నిజమే.. జనసేనలోకి వచ్చేదంటే

    అది మాత్రం నిజమే.. జనసేనలోకి వచ్చేదంటే

    ఆ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. 'అందరూ అనుకుంటున్నట్లు జనసేన పార్టీ విషయంలో నాకు.. అన్నయ్య సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. నాకే కాదు.. ఆయన అందరి మంచీ కోరుకుంటారు. ఇక, జనసేనలోకి చిరంజీవి గారు ఎప్పుడు వస్తారన్న దానిపై మాత్రం ఇప్పుడే ఏమీ చెప్పలేను. ఆయన వచ్చినా రాకున్నా నాకు ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చాడాయన.

    English summary
    Recently leader Nadendla Manohar made a surprising revelation and revealed that it was Megastar Chiranjeevi who convinced his brother and Jana Sena Chief Pawan Kalyan to again..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X