వెరీ ఇంట్రెస్టింగ్: మెగా కాంబినేషన్‌పై పవన్ స్పందన.. తప్పకుండా చేస్తానంటూ ప్రకటన

By Manoj Kumar P

టాలీవుడ్‌లో ఉన్న సినీ కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ప్రత్యేకం అనే టాక్ ఉంది. ఆ కుటుంబం నుంచి దాదాపు పది మందికి పైగా హీరోలు సినీ రంగ ప్రవేశం చేయడంతో పాటు నిర్మాతలుగానూ వ్యవహరించడమే. ఈ కుటుంబానికి చెందిన గీతా ఆర్ట్స్ ప్రస్తుతం ఉన్న బడా నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు సంపాదించింది. అలాగే, ఈ కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో చాలా మంది స్టార్లుగా వెలుగొందుతున్నారు. అందుకే ఈ కుటుంబానికి చాలా మంది అభిమానులు ఉన్నారని అంటుంటారు. తాజాగా ఈ కుటుంబం నుంచి ఓ సినిమా రాబోతుందని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. అది ఎవరితో అని అనుకుంటున్నారా..? పూర్తి వివరాల కోసం పూర్తిగా చదవండి.

అందరూ కలిసి నటించి మెప్పించారు

అందరూ కలిసి నటించి మెప్పించారు

తెలుగు సినీ పరిశ్రమలో క్లాసికల్‌గా నిలిచిన చిత్రాల్లో ‘మనం' ఒకటి. దీనికి కారణం అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల నటులు కలిసి నటించడమే. ఈ సినిమా ఆ ఫ్యామిలీకి మధురానుభూతిని మిగిల్చింది. అలాగే, సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇదే తరహా సినిమా చేయాలని ఇండస్ట్రీలోని అన్ని ఫ్యామిలీలు ప్లాన్ చేశాయి. అందులో మెగా ఫ్యామిలీ కూడా ఉంది.

చాలా కాంబినేషన్‌లు అన్నారు

చాలా కాంబినేషన్‌లు అన్నారు

మెగా ఫ్యామిలీ నుంచి ఓ మల్టీస్టారర్ మూవీ రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. గతంలో సీనియర్ ప్రొడ్యూస్ సుబ్బిరామిరెడ్డి.. చిరంజీవి - పవన్ కలయికలో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. దీని తర్వాత చిరు, చరణ్ కాంబో ఉంటుందని వార్తలు వచ్చాయి. అలాగే, పవన్ - చరణ్.. వరుణ్ - సాయి ధరమ్ మూవీ ఉంటుందన్నారు.

అన్నయ్య, కొడుకుతో సినిమాలు

అన్నయ్య, కొడుకుతో సినిమాలు

వాస్తవానికి మెగా ఫ్యామిలీలో గతంలోనే నాగబాబు, చిరంజీవి కలిసి నటించారు. అలాగే, తమ్ముడి నిర్మాణంలో చిరు చాలా సినిమాల్లో నటించారు. మొన్నామధ్య రామ్ చరణ్‌తో సైతం నాగబాబు సినిమా తీశారు. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిచిన ‘ఆరెంజ్' మూవీ తీవ్ర నష్టాలను మిగల్చడంతో నాగబాబు మరోసారి ప్రొడక్షన్ చేసేందుకు ధైర్యం చేయలేదు.

పవన్ కల్యాణ్ కూడా మొదలెట్టాడు

పవన్ కల్యాణ్ కూడా మొదలెట్టాడు

పవన్ కల్యాణ్ గతంలో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘రుద్రవీణ', ‘త్రినేత్రుడు', ‘ముగ్గురు మొనగాళ్లు' అనే సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. వాస్తవానికి ఇవి చిరు సినిమాలే కాబట్టి ఆయన పేరు వేశారు. ఇక ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే సంస్థను స్థాపించి ‘సర్ధార్ గబ్బర్ సింగ్', ‘ఛల్ మోహన్ రంగా' అనే సినిమాలు నిర్మించాడు.

రామ్ చరణ్‌తో మూవీపై క్లారిటీ

రామ్ చరణ్‌తో మూవీపై క్లారిటీ

కొద్ది రోజుల క్రితం ఓ ఫంక్షన్‌లో తాను త్వరలోనే రామ్ చరణ్‌తో ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు పవన్ ప్రకటించాడు. కానీ, ఇప్పటి వరకు దాని తాలూకు ప్రకటన వెలువడలేదు. అయితే, తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ‘రామ్ చరణ్‌తో సినిమా త్వరలోనే ఉంటుంది. సరైన కథతో ఏ దర్శకుడైనా వస్తే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది' అని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X