పవన్ కళ్యాణ్ ‘... రాంబాబు' సెన్సార్ పూర్తి
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు(గురువారం) పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి u/A సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ సభ్యులు ఈ చిత్రం చూసి చాలా మెచ్చుకున్నారని, వారి ఉత్సాహం చూసిన తమ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందన్న నమ్మకం కలుగుతుందోనని దర్సక,నిర్మాతలు చెప్తున్నారు.
పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ... చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని యు బై ఎ సర్టిఫికేట్ పొందింది. సినిమా చూసిన సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మి గారితో పాటు మిగతా సభ్యులు కూడా చాలా మంచి సినిమా చేసానని అప్రిషియేట్ చేసారు. సినిమాని ఎక్కడా టచ్ చేయకుండా, ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే ఇదో ల్యాండ్ మార్క్ సినిమా అవుతుంది. ఆయన ఫెరఫార్మెన్స్ హైలెట్ గా ఈ సినిమా ఉంటుంది. ఇందులో ఆయనతో డబ్బింగ్ లో చెప్పిన డైలాగ్స్ చాలా ఎక్సలెంట్ గా వచ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో చెప్పిన డైలాగ్స్ కు మంచి అప్రిషియేషన్ వచ్చింది. తప్పుకుండా చాలా పెద్ద రేంజిలో హిట్ అవుతుంది అన్నారు.
నిర్మాత దానయ్య మాట్లాడుతూ... సెన్సార్ సభ్యుల ఎక్సైట్మెంట్ చూస్తుంటే తప్పకుండా మా బ్యానర్ లో ఇదో పెద్ద హిట్ సినిమా అవుతుందనిపిస్తోంది. చాలా గొప్ప సినిమమా తీసానని సెన్సార్ సభ్యులంతా అఫ్రిషియేట్ చేస్తూంటే సినిమా మీద మాకు ఉన్న నమ్మకం మరింత పెరిగింది అన్నారు. ఈ నెల 18న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం అన్నారు. మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుతూ సినిమాకు హైలెట్ అవుతుందని అన్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్


Click it and Unblock the Notifications











