'శ్రీరామ రాజ్యం'పై పవన్ కామెంట్
రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ పూర్తైన వెంటనే పవన్ కళ్యాణ్ ..ప్రసాద్ ల్యాబ్స్ లో శ్రీరామ రాజ్యం ప్రత్యేక షో వేయించుకుని చూసారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ... చిన్నప్పుడు లవకుశ చూసే అవకాశం కలగలేదు. ఇప్పుడు బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామ రాజ్యం చిత్రం చూసే అదృష్టం కలిగింది. చాలా బాగుంది సినిమా అన్నారు. సీతమ్మ తల్లిని రాముల వారు వదిలేసి వెళ్లిపోతే.. నాకు అప్పుడు ఇంత బాధ పడిందా అనేది చదివినా తెలియలేదు. కానీ తెరపై చూస్తున్నప్పుడు ఇంత బాగా బాధపడిందా అనేది..అర్దమైంది. బాపు గారు అంత బాగా తెరకెక్కించారు. చాలా చక్కగా చిత్రీకరించారు.
బాపు గారు సినిమా తీసిన విధం చూస్తుంటే ఆయన మీద ఇంకా గౌరవం పెరిగిపోయింది. రాముల పాత్రలో నటించిన బాలకృష్ణ గారు గానీ, సీతమ్మ పాత్రలో నటించిన నయనతారగానీ అధ్బుతంగా నటించారు. వారికి మనస్ పూర్తిగా నా అభినందనలు తెలియచేస్తున్నాను అన్నారు. ఇక ప్రస్తుతం పవన్ నటించిన పంజా విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే పంజా పాటలు చాలా పాపులర్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











