తనకు ఎవరూ పోటీ కాదని, ఎవరికి నచ్చిన విధానాన్ని వారు ముందుకు తీసుకువెళ్లడంలో తప్పు లేదని జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి యువరాజ్యం అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. అలాగే ఎన్నికల్లో రాష్ట్రంలో స్టార్ వార్ జరగబోతోందన్న అభిప్రాయాన్ని ఆయన కొట్టిపారేశారు. అంతేగాక రాజకీయాల్లో సినీ గ్లామర్ అనేది కేవలం టేకాఫ్ కే ఉపయోగపడుతుందని..సినీ నటుడు వచ్చినంత మాత్రాన జనం ఓట్లేయరని ఆయన అన్నారు...ప్రజలు తమ సమస్యలకు ఎవరు పరిష్కారం చూపగలరని వారు భావిస్తారో వారికే ఓటేస్తారు అని పవన్ స్పష్టం చేసారు. అయితే బయిట మాత్రం ఇప్పుడు పవన్ కీ ఎన్టీఆర్ మధ్య పోటీ అనేదే సర్వత్రా వ్యక్తం అవటం గమనార్హం.