తెలుగు వారికి అన్యాయం: సావిత్రి, ఎస్వీఆర్ పేర్లు ప్రస్తావించిన పవన్ కళ్యాణ్!

By Bojja Kumar

Recommended Video

తెలుగు వారికి అన్యాయం.. వాళ్ళ పేర్లు ప్రస్తావించిన పవన్ !

భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ అవార్డుల విషయంలో తెలుగు వారికి అన్యాయం జరుగుతుందనే వాదన చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది అర్హులు ఉన్నా వారిని పట్టించుకోవడం లేదని పలువురు అభిమానులు, సినీ రంగానికి చెందిన వారు సందర్భం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని తెరపైకి తెస్తూనే ఉన్నారు.

 రాజకీయ నాయకుడిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్

రాజకీయ నాయకుడిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్

ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్ అసలు సిసలైన రాజకీయ నాయకుడిలా మాట్లాడటం మొదలు పెట్టారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మఅవార్డులు ప్రకటించగా ఆయన స్పందించారు.

 వారికి అభినందనలు

వారికి అభినందనలు

పద్మ అవార్డు గ్ర‌హీత‌లంద‌రికీ త‌న త‌ర‌ఫున‌, జ‌న‌సేన పార్టీ శ్రేణుల‌ త‌ర‌ఫున శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాన‌ని సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజాకి, ఏపీ నుంచి అవార్డు అందుకోబోతున్న కిడాంబి శ్రీకాంత్‌కి అభినందనలు తెలియ‌జేవారు.

 అన్యాయం జరుగుతోందని పరోక్షంగా

అన్యాయం జరుగుతోందని పరోక్షంగా

హైదరాబాద్‌లోని తమ పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప‌ద్మ అవార్డులు అందుకున్న వారిలో తెలుగువారు ఇంకా ఉండి ఉంటే బాగుండేద‌ని త‌న‌కు అనిపించింద‌న్నారు. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా తెలుగు వారికి పద్మ అవార్డుల విషయంలో అన్యాయం జరుగుతోందని చెప్పకనే చెప్పారు.

 సావిత్రి, ఎస్వీఆర్‌లకు ఇవ్వాలి

సావిత్రి, ఎస్వీఆర్‌లకు ఇవ్వాలి

మున్ముందు ప‌ద్మ పుర‌స్కారాల్లో అల‌నాటి న‌టులు సావిత్రి, ఎస్వీఆర్‌కి ప‌ద్మ అవార్డులు ఇవ్వాల‌ని తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాల ప్రతిపాదనించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కోరారు.

ఏపీకి ఒకటి, తెలంగాణకు జీరో

ఏపీకి ఒకటి, తెలంగాణకు జీరో

ఈ సారి పద్మ అవార్డుల విషయంలో తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఏపీకి ఒకే ఒక అవార్డు దక్కగా.... తెలంగాణకు ఒక్క పద్మ కూడా దక్కలేదు. దీంతో పద్మ అవార్డుల్లోనూ రాజకీయ వివక్ష ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాలకే ప్రాధాన్యమా?

ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాలకే ప్రాధాన్యమా?

త్వరలో ఎన్నికలు జరుగబోయే, రాజకీయంగా లాభం ఉండే రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. ఈ సారి మహారాష్ట్రకు 11, కర్నాటకకు 9, తమిళనాడుకు 6 పద్మ అవార్డులు దక్కాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X