Pawan Kalyan సంచలన వ్యాఖ్యలు: ప్రభాస్, మహేశ్ రెమ్యూనరేషన్ అలా.. తారక్, చరణ్ సహా ఎవరినీ వదల్లేదుగా!
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బడా హీరోల్లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అంతలా అతడికి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ మధ్య కాలంలో అభిమానుల కోసం వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చేతి నిండా మూవీలతో బిజీగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ అధ్యక్షుడిగా 'వారాహి యాత్ర'ను చేస్తున్నాడు. ఈ సందర్భంగా తాజాగా జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్.. టాలీవుడ్‌లోని కొందరు హీరోలపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీకోసమే!
ఆ హీరోలు అంటే గౌరవం:జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో తలపెట్టిన 'వారాహి యాత్ర' తాజాగా ముమ్మిడివరం నియోజవర్గంలో జరిగింది. ఇందులో పవన్ కల్యాణ్ హీరోల గురించి మాట్లాడుతూ.. 'జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ప్రభాస్ గారు వీళ్లందరంటే నాకు గౌరవం, ఇష్టం' అన్నాడు.

సినిమా, రాజకీయం వేరు:ఈ మీటింగ్‌లో పవన్ కల్యాణ్ కొనసాగిస్తూ.. 'తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అందరు హీరోల సినిమాలను నేను చూస్తాను. కనిపిస్తే మేమంతా మాట్లాడుకుంటాం. అయితే, సినిమాల పరంగా మీకు హీరోల మీదున్న ఇష్టాన్ని రాజకీయంగా చూపించకండి. ఎందుకంటే రాజకీయాలు వేరు.. సినిమాలు వేరు. ఇక్కడ రైతులకు కులం అనేది లేదు. అది మీరు గ్రహించాలి' అని చెప్పుకొచ్చాడు.

నా మాట ఒకసారి వినండి:ఆ తర్వాత పవన్ కంటిన్యూ చేస్తూ.. 'సినిమాలు పరంగా మీరు మహేష్ గారిని ఇష్టపడండి, ఎన్టీఆర్ గారిని ఇష్టపడండి, బాలయ్య గారిని ఇష్టపడండి.. సినిమా అనేది వినోదం, ఆనందాన్ని ఇస్తుంది. కానీ, రాజకీయం దగ్గరికి వచ్చే సరికి మాత్రం నా మాట ఒక్కసారి వినండి. అందరు హీరోల అభిమానులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆలోచించండి' అని రిక్వెస్ట్ చేశాడు.

వాళ్లిద్దరూ పెద్ద హీరోలు:ఇదే మీటింగ్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 'ప్రభాస్ గారు ఉన్నారు.. ఆయన నాకంటే పెద్ద హీరో. మహేశ్ బాబు గారు ఉన్నారు. ఆయనా నాకంటే పెద్ద హీరో. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇలా ఒప్పుకోడానికి ఏమాత్రం ఇగోలు లేవు. వాళ్లు నాకంటే పెద్ద హీరోలు. ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారు. పాన్ ఇండియా హీరోలు' అని వివరించాడు.

వాళ్లిద్దరూ గ్లోబల్ రేంజ్:తర్వాత పవన్ కల్యాణ్ RRR హీరోల గురించి మాట్లాడాడు. 'రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్థాయికి వెళ్లిపోయారు. వాళ్లు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. కానీ, నేను తెలియదు. అయినా నాకు ఎలాంటి ఇగోలు లేవు. నాకు సగటు మనిషి బాగుండాలి. కష్టంలో ఉన్న ఒక దళిత కుటుంబంలోని పేదరికాన్ని పారదోలాలి. నేను ఇట్లానే ఆలోచిస్తాను' అని ముగించాడు.

ఆ సినిమాల షూటింగ్:ప్రస్తుతం పవన్ కల్యాణ్ కల్యాణ్ 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు', 'బ్రో' మూవీలు చేస్తున్నాడు. ఇక, ఆంధ్రాలో 'వారాహి యాత్ర'ను చేస్తున్నా.. ఇప్పుడు కొన్ని సినిమాల షూటింగ్‌లలోనూ పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే వైజాగ్‌లో జరగనున్న షెడ్యూల్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' షూట్‌లో పాల్గొనబోతున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











