రోజాకి మరో సారి యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. పదే పదే ఘటైన పదజాలంతో ప్రజారాజ్యం పార్టీపై విరుచుకుపడుతున్న తెలుగుమహిళ అధ్యక్షురాలు రోజా మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని పవన్ అన్నారు. రెండు లేదా మూడుసార్లు విమర్శిస్తుంటే కార్యకర్తలు, అభిమానులు బాధపడుతున్నారని స్పందించాం తప్ప రోజా స్థాయికి దిగజారి మాట్లాడాల్సి అవసరం లేదన్నారు. యువతలో ఎక్కువ మంది సమాజసేవపైనే ఆసక్తి చూపుతున్నారని, ఎన్నికల్లో పోటీ చేయాలని, పదవులు సాధించాలని లేదని పవన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో తన ప్రమేయం ఉండదన్నారు. అలాగే రోజా విషయం ఆలోచించవద్దని, ఆ మాటలు పట్టించుకోవద్దని చెప్పుకొచ్చారు. ఇంతకు ముందు రోజా..పవన్ ని ఉద్దేశించి తాగి తొంగుంటున్నాడంటూ కామెంట్ చేసింది. అంతేగాక పవన్ పెళ్ళికి తానే కారణం అంటూ చెప్పుకొచ్చింది. వీటిని పవన్ కూడా కౌంటర్ ఇచ్చారు.
Story first published: Thursday, March 12, 2009, 18:04 [IST]