twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్విట్టర్ లో రాసే హీరోలపై పవన్ విసుర్లు

    By Srikanya
    |

    ట్విట్టర్ లో రెగ్యులర్ గా ట్వీట్ చేసే వారిపై పవన్ కళ్యాణ్ విమర్శ చేస్తూ విసుర్లు విసిరారు. ఆయన తాజాగా పంజా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ...ట్విట్టర్ వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇప్పుడే షూటింగ్ నుంచి వచ్చాను..బాగా అలిసి పోయాను..తిన్నాను..కూర్చున్నాను..గుడ్ మార్నింగ్..గుడ్ ఈవినింగ్ లాంటి కబుర్లే కదా...అంతకుమించి ట్విట్టర్ లో చెప్పుకునేందుకు ఏమీ లేదు. నాకు అలాంటివి పెద్దగా ఇంట్రస్ట్ ఉండవు..అందుకే నేను ట్విట్టర్ కు దూరం అని తేల్చి చెప్పారు. అలాగే ఇది విన్న కొందరు రెగ్యులర్ గా ట్విట్టర్ లో అప్ డేట్స్ ఇచ్చే హీరోలు,హీరోయిన్స్, దర్శకులు భుజాలు తడుముకున్నారు. ఇది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. పవన్ ఆ ట్విట్టర్ హీరోలను భలే దెబ్బకొట్టాడని అంటున్నారు.

    ఇక ప్రస్తుతం అందరి దృష్టీ పవన్ పంజాపైనే ఉంది. కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవలే విడుదల చేసిన పవన్‌కళ్యాణ్ స్టిల్స్‌కి, పాటలకి అపూర్వమైన స్పందన వస్తోంది. ఇందులో ఆయన గెటప్ ఎంత కొత్తగా ఉందో... పాత్ర చిత్రణ కూడా అంత కొత్తగా ఉంటుంది. స్టయిలిష్ డెరైక్టర్ విష్ణువర్థన్ ఈ సినిమాను న్యూలుక్‌తో ప్రెజెంట్ చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. యువన్‌శంకర్‌రాజా సంగీతం కూడా ఈ సినిమాకు ఎస్సెట్. ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు:అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్‌ బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్:అనూవర్థన్.

    English summary
    Pawan Kalyan opined that there is no point in sharing things like Back from shooting, today I’m sitting idle relaxing for a while, etc in Twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X